ప్రాజెక్టు పనులు వేగవంతంగా చేపట్టాలి
ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేసి పనులు వేగవంతంగా చేపట్టాలని ఉమ్మడి జిల్లా ప్రాజెక్టుల సమితి వైస్‌చైర్మన్ బెక్కెం జనార్దన్ అన్నారు. మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పక్కనే క్ప ష్ణ, డిండి, తుగభద్ర నదులు పారుతున్నా చుక్కనీరు కూడా ఉపయోగించుకోకుండా వర్షాలపై ఆధారపడుతున్న పరిస్థితి ఏర్పడిందన్నారు.
- ఉమ్మడి జిల్లా ప్రాజెక్టుల సమితి వైస్ చైర్మన్ బెక్కెం జనార్దన్
హన్వాడ, జూలై 4 : ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేసి పనులు వేగవంతంగా చేపట్టాలని ఉమ్మడి జిల్లా ప్రాజెక్టుల సమితి వైస్‌చైర్మన్ బెక్కెం జనార్దన్ అన్నారు. మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పక్కనే క్ప ష్ణ, డిండి, తుగభద్ర నదులు పారుతున్నా చుక్కనీరు కూడా ఉపయోగించుకోకుండా వర్షాలపై ఆధారపడుతున్న పరిస్థితి ఏర్పడిందన్నారు.
ఉమ్మడి జిల్లాలో 40 లక్షల భూములు సాగునీరు లేక ఏడారిగా మారిందన్నారు. ఉమ్మడి జిల్లాకు సాగు, తాగునీరు కోసం పార్టీలకు అతీతంగా అందరూ కలసిరావాలని పిలుపునిచ్చారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్, కాల్వలను పూర్తి చేస్తేనే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీరు వస్తుందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల నుంచి డిండి ప్రాజెక్టుకు నీళ్లు తరలించి నల్లగొండకు తీసుకెళ్లాలని పాలకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడేళ్లు కావస్తు న్నా నేటికి ప్రాజెక్టుల పనులు చేపట్టడంలేదని, ఇప్పు టికైనా ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో ఉన్న రిజర్వాయ ర్లు, ప్రాజెక్టుల పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
19న విస్తృత రౌండ్ టేబుల్ సమావేశం..
ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో ఉన్న ప్రాజెక్టులపై మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలతో ఈ నెల 19న జిల్లా కేంద్రంలోని క్రౌన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో విస్తృత రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని ఉమ్మడి జిల్లా ప్రాజెక్టుల సమితి కమిటీ సభ్యులు తెలిపారు. జి ల్లాల్లో ఉన్న ప్రాజెక్టులు, రిజర్వేయర్లుపై, సాగు, తాగునీరు మన వాట దక్కిచుకోవడం కోసమే సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉమ్మడి జి ల్లా ప్రాజెక్టుల సమితి సభ్యులు వీరబ్రహ్మేంద్రాచారి, రహిద్ మహ్మద్, ఎండీ ఖాలీమ్, లింగస్వామి మాజీ ఎంపీపీ బాలరాజ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కరుణాకర్‌గౌడ్, సింగిల్ విండో చైర్మన్ కృష్ణయ్యగౌడ్, వైస్ చైర్మన్ శ్రీనివాసులు, బీజెపీ మండలాధ్యక్షుడు లింగం , మాజీ వైస్ ఎంపీపీ లక్ష్మయ్య, మాజీ సర్పంచ్ వెం కన్న, నాయకులు కుర్మయ్య, అనంతరెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

