కొల్లాపూర్, జూన్ 7: పాలమూరు రైతులను మోసం చేయొద్దని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి సూచించారు. కొల్లాపూర్‌లో సీఎం రే వంత్‌రెడ్డి పర్యటన టూరిస్ట్ స్పాట్‌కు వచ్చి వెళ్లినట్లు ఉన్నదని ఆయన విమర్శలు గుప్పి ంచారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఆ యన ఈ సందర్భంగా మండిపడ్డారు. మం డలంలోని రామాపురం గ్రామంలో వరి ధా న్యం కొనుగోలు కేం ద్రాన్ని ఆదివారం ఆ యన పరిశీలించారు. ఈ సందర్భంగా అక్క డి రైతుల కష్టాల గురిం చి ఆరా తీశారు. బస్తా కు 10కిలోలు తరుగు తీస్తున్నారని రైతులు మాజీ ఎమ్మెల్యేతో మొరపెట్టుకోవడంతో ఆయన ప్రభుత్వ తీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం వెంటనే తరుగు లేకుండా రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేయాలని డి మాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనకు వచ్చిన ప్రాంతానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే రామాపురం గ్రామం ఉన్నదని సీఎం ఒక్కసారి రైతులతో మాట్లాడి ఉంటే వారి కష్టాలు తెలిసి ఉండేవన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కొల్లాపూర్‌కు వస్తున్నారంటే కొల్లాపూర్ ప్రజానీకం అంతా కొల్లాపూర్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారం దుక్కుతోందని భావించారు కానీ ఆచరణలో అదేమి జరగలేదన్నారు. సీఎంను కొల్లాపూర్‌కు తీసుకొచ్చి ఏం సాధించారో మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజానీకానికి సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. బీఆర్ఎస్ హయాంలో మంజూరు చేసిన జిల్ధార్తిప్ప చెరువుకు సాగునీరు, సింగోటం గోపల్‌దిన్నె లింక్ కెనాల్, బాచారం హైలెవల్ కెనాల్ పనులను ఈ ప్రభుత్వం మరుగున పడిసేందన్నారు. రామాపూరం వాగుపై వంతెన నిర్మాణాన్ని ఈ ప్రభుత్వం నిలిపివేసిందన్నారు.
కేసీఆర్ చేసిన కృషితో ఇప్పుడు ఇప్పుడే పాలమూరు రైతాంగం బాగుపడుతున్నారని, సొంత జిల్లా వ్యక్తి సీఎం అయినా పాలమూరు రైతులకు నష్టం జరుగుతోందని ఆరోపించారు. కర్ణాటక ప్రభుత్వం జూరాలకు ఎగువన ఉన్న ప్రాజెక్టులతో పాలమూరు ప్రాజెక్టులు పడావు పడే అవకాశం ఉందన్నారు. వరద జలాలు రెండు వేల క్యూసెక్కులు వచ్చినా జూరాలలో చుక్క నీరు లేదన్నారు. ప్రభుత్వం వెంటనే రైతు వ్యతిరేక విధానాలను మానుకోవాలన్నారు. మాజీ ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నిరంజన్ గౌడ్, సర్పంచ్ కొమ్మ గోపాల్, రైతు బంధు సమితి మండల మాజీ అధ్యక్షుడు నిరంజన్ తదితరులు ఉన్నారు.