కొల్లాపూర్/కొల్లాపూర్/పెంట్లవెల్లి, ఏప్రి ల్ 5 : అభివృద్ధి పేరుతో దళితుల భూములను చట్టవిరుద్ధంగా లాక్కుంటున్నారని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం అధికారులు చేపట్టిన హెలిపాడ్ నిర్మాణంలో భూములను కోల్పోతున్న దళితులను పరామర్శించేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే బీరంను పోలీసులు సోమశిల మార్గం మధ్యలో అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, బీఆర్ఎస్ నాయకుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకున్నది.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మె ల్యే బీరం విలేకరుతో మాట్లాడుతూ అభివృద్ధికి బీఆర్ఎస్ వ్యతిరేకం కాదని కానీ రాజకీయాలను చేస్తూ దళితుల భూములలో హెలిపాడ్ నిర్మాణం చేపట్టడం సరైనది కాదన్నారు. అసైన్డ్భూములను తీసుకొనే సమయంలో తీసుకోవాల్సిన లీగల్ ప్రక్రియకు విరుద్ధంగా దళితుల నుంచి బలవంతగా భూ ములను తీసుకుంటున్నారని పేర్కొన్నారు. చట్ట విరుద్ధంగా వెళ్తున్న వారిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. అధికారంతో కాంగ్రెస్ చేస్తున్న అరాచాకాలపై తమ ప్రభుత్వం వచ్చిన రోజు మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.
కొల్లాపూర్ మండలం సోమశిల గ్రా మంలో ఆదివారం అధికారులు హెలిపాడ్ నిర్మాణం కోసం దళితుల భూమిని చదును చేస్తుండగా అడ్డుకున్న బాధిత దళిత రైతులు రంగస్వామి, తిరుపాల్, కురుమ్య, కుమార్‌లను కొల్లాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకొని పెంట్లవెల్లి పోలీస్ సేష్టన్‌లో నిర్బంధించారు. విషయం తెలుకున్న మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ పెంట్లవెల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి బాధిత రైతులను పరామర్శించి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని రోజులు ఓపిక పడితే బీఆర్ఎస్ అధికారంలో వస్తోందని అధైర్యపడొద్దన్నారు. మాజీ ఎమ్మెల్యే వెంట కొల్లాపూర్, పెంట్లవెల్లి మండలాల బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.