కోడేరు, నవంబర్ 9 : ఇన్సూరెన్స్ చేస్తేనే కొత్తగా పంటరుణాలు ఇస్తానంటూ బ్యాంక్ మేనేజర్ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు ఏపీజీవీబీ మేనేజర్ నాగమహేశ్ తీరుతో ఇక్కట్లు త ప్పడం లేదని వాపోతున్నారు. కొత్తగా వ్యవసాయ రుణాలు కావాలని బ్యాంక్‌లో అధికారులను అడిగి తే ఇన్సూరెన్స్ చేయాలని.. ఇరకాటంలో పెడుతున్నారన్నారు. దీనికితోడు రైతు భరోసా డబ్బులు కూడా ఇదే బ్యాంక్‌లో ఉన్న ఖాతాల్లో పడితేనే మీకు కొ త్తగా రుణాలు ఇస్తానంటూ మెలిక పెడుతూ వేధిస్తున్నాడని ఆరోపించారు.
ఇలా రోజుల తరబడి వారం రోజులుగా బ్యాంక్ చుట్టూ తిప్పుకుంటున్నారన్నా రు. ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎలాంటి షరతులు లేకుండా రుణాలు ఇవ్వాలని ఆదేశిస్తుండగా.. ఏపీజీవీబీ మేనేజర్ మా త్రం ఇన్సూరెన్స్ అంటూ.. రైతు భరోసా అంటూ.. స తాయిస్తున్నారని ఆందోళన చెందుతున్నారు. సర్కారు రైతుబీమా కింద రూ.5 లక్ష ల ఇన్సూరెన్స్ అమలులో ఉందని, మీ బ్యాంకులో మాకు ఇన్సూరెన్స్ అవస రం లేదని రైతులు ప్రశ్నిస్తే.. మీకు రుణం ఇవ్వను అం టూ ఖరాఖండిగా చెబుతున్నారని ఆవేదన చెందుతున్నారు.
అలాగే రైతుబంధు కోసం బ్యాంక్ అకౌంట్ మార్పిడీ చేయడం కోసం వ్యవసాయశాఖ అధికారులను అడిగితే ఇప్పట్లో ఆప్షన్ రాలేదని, వచ్చిన వెం టనే మారుస్తామని చెబుతున్నారని అన్నారు. మరోవైపు బ్యాంక్ మేనేజర్ ఇన్సూరెన్స్, రైతుబంధు ఖా తాలకు లింక్ పెట్టడంతో తాము పంట రుణాలు పొందే పరిస్థితి లేకుండా పోయిందని మదనపడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు చొరవ తీసుకొని ఎలాంటి షరతుల్లేకుండా పంట రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
బ్యాంక్ మేనేజర్ చెప్పిన విధంగా ఇన్సూరెన్స్ చేసిన రైతులకు పంట రుణం అందించి వారి నుంచి రూ.1000 కమీషన్ తీసుకున్నట్లు ఆరోపణలు ఉ న్నాయి. ఈ విషయమై గతంలో రైతు సంఘాల నా యకులు కొం దరు బ్యాంక్ వద్ద కు వెళ్లి మేనేజర్‌ను ప్రశ్ని స్తే తిరిగి సంబంధిత రైతులకు డబ్బులు వాపస్ ఇచ్చాడు.
కాగా రై తులకు రుణాలు అందిస్తూ చేదోడు వాదోడుగా ఉండాల్సిన బ్యాంక్ మేనేజర్, ఇతర సిబ్బంది, రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంట రుణాలు ఇవ్వకుండా సతాయించడంతోపాటు కమీషన్లు తీసుకుంటుండడంపై బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. కాగా ఈ విషయమై బ్యాంక్ మేజనేర్ నాగమహేశ్ను వివరణ కోరగా ప్రతి ఒక్కరికీ పంట రుణాలు ఇస్తున్నామని, కాకపోతే కొందరు రైతులు లోన్లు రెన్యూవల్ చేయటం లేదని.. అందుకోసం ఇన్సూరెన్స్, రైతుబంధు అకౌంట్లు మా బ్యాంకుకు అనుసంధానం ఉంటే రెన్యూవల్ చేయించే అవకాశాలు ఉంటాయని చెబుతున్నట్లు వివరించారు.