కోడేరు, మే 14 : రాజీవ్ యువ వికాసానికి ఆదిలోనే ప్రభుత్వం మొకాలడ్డుతున్నది. యువతకు ఎలాంటి షరతులు లేకుండా రుణం ఇస్తున్నామని ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం బ్యాంకులు లబ్ధిదారుల ఎంపికలో సిబిల్ స్కోరు తప్పనిసరిగా ఉండాలనే నిబంధనలు పెట్టడంతో నిరుద్యోగులు తీత్ర నిరాశ చెందుతున్నా రు. గతంలో రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన వారికి పూర్తి సబ్సిడీ లేని రుణాలు ఇవ్వడం కష్టమేనని తెలుస్తోంది. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టింది.
గతనెలలోనే ఆన్లైన్లో దరఖాస్తు తుదిగడువు ముగిసింది. ఎవరైతే ఆన్లైన్లో దరఖాస్తు చేసి అన్నిరకాల పత్రాలను సమర్పించిన వారి దరఖాస్తుల పరిశీలన ప్రారంభమైంది. వీటిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలుగా విభజించి దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలన పూర్తయిన తర్వాతనే ఆయా సంక్షేమ శాఖలకు దరఖాస్తులను పంపించనున్నారు. బ్యాంకుల ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది. ఇక్కడ రూ.2నుంచి4లక్షల వరకు రుణా లు తీసుకునే వారికి సిబిల్ స్కోరు ఆధారంగానే బ్యాంకులు రుణాలను మంజూరు చేయనున్నాయి.
రూ.2లక్షలు కావాలంటే..
రాజీవ్ యువ వికాసంలో రూ.50వేల నుంచి 4లక్షల వరకు రుణాలను ఇవ్వనున్నారు. యువత పొందే రు ణాల ఆధారంగానే బ్యాంకు సబ్సిడీ రుణాలను ఇస్తా రు. బ్యాంకు రుణాల విషయంలో లబ్ధిదారుడి సిబిల్ స్కోరు ప్రామాణికంగా తీసుకోనున్నారు. వీటిలో రూ.50వేల రుణానికి వందశాతం సబ్సిడీ ఉంది. దీనికి ఏవిధమైన బ్యాంకు రుణం, సిబిల్ స్కోర్ అవసరం ఉండదు. రూ.లక్ష రుణానికి 90 శాతం సబ్సిడీ ఉంటుంది. 10శాతం మాత్రమే బ్యాం కు రుణం. దీనికి సైతం సిబిల్స్కోరు అవసరం లేదు. రూ.2లక్ష ల రుణానికి 80శాతం సబ్సిడీ ఉం టుంది. 20శాతం బ్యాంకు రుణం పొ ందాల్సి ఉంటుంది. ఇక్కడ సిబిల్స్కోర్ అవసరం ఉంటుంది. రూ.4లక్షల రుణాని కి 70శాతం సబ్సిడీ ఉంటుంది. మిగతా 30 శాతం బ్యాంకు రుణం ఉంటే.. సిబిల్ స్కోరు అవసరమని అధికారులు పేర్కొంటున్నారు.
మహిళలకు పెద్ద పీట
ఈ పథకంలో మహిళలకు పెద్దపీట వేయనున్నారు. వితంతువులు, ఒంటరి మహిళలకు అత్యంత ప్రా ధాన్యం ఉంటుంది. ఆ తర్వాత నిరుపేద మ హిళలకు ప్రాధాన్యం దక్కుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ వారీగా గుర్తించి ఆయా సంక్షేమ శాఖలు లబ్ధిదారులను ఎంపిక చేస్తాయి.