పాలమూరు ఫిబ్రవరి 14: పాలమూరు వీరుడు పండుగ సాయన్న ఆశయాలను కొనసాగిస్తామని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ముదిరాజ్ అన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ మండల పరిధిలోని ధర్మపురం గ్రామంలో పండుగ సాయన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. పేదల కోసం రాబిన్ హుడ్గా అవతారం ఎత్తి బడుగు బలహీన వర్గాల ప్రజలకు సేవ చేశారన్నారు.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ముచ్చటగా ముదిరాజులకు మూడు సీట్లు ఇచ్చి గెలిచిన ఒకే ఒక అభ్యర్థి వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇస్తానని ఇంకా ఊరిస్తోందని దీని భావమేందో తెలంగాణ ముదిరాజులు అర్థం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు . బీసీ కులగణలో బీసీలను 20 లక్షలకు పైగా తక్కువ చూ పి కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక తప్పిదం చేసిందని .. రీ సర్వే లో న్యాయం చేయకపోతే బీసీ ల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.
మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తె లంగాణలో అధికారంలోకి రాగానే అందేశ్రీ రచించిన తెలంగాణ రాష్ట్ర గీతంలో పాలమూరు వీరుడు రాబిన్ హుడ్ పండుగ సాయన్న వీరగాధను పొందుపరిచామని, ప్రతిరోజూ ప్రతి పాఠశాలలో ఆయనను స్మ రించుకుంటున్నామని తెలిపారు. బీసీ నేత బెక్కెం జనార్దన్ రచించిన పండుగ సాయన్న పుస్తకాన్ని బండ ప్రకాశ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాద వ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, వెంకటేశ్, బెక్కెం జనార్దన్, ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు మెట్టుకాడి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.