మహబూబ్ నగర్ కలెక్టరేట్/ దేవరకద్ర / ఊర్కొండ : సామాజిక సమానత్వం, అస్పృశ్యత నిర్మూలన కోసం బాబు జగ్జీవన్రాం చేసిన అవిశ్రాంత పోరాటం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ విజయేందిరబోయి (Collector Vijayendiraboi) అన్నారు.
బాబు జగ్జీవన్రాం జయంతి (Jagjivanram Birth Anniversary ) సందర్భంగా జిల్లా కేంద్రంలోని తెలంగాణ కూడలీ, అంబేద్కర్ కళాభవన్లో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్ విజయేందిరబోయి, ఎస్పీ డి. జానకి, అదనపు కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, దళిత సంఘాలు, కుల సంఘాలు, యువత సంఘాలు, వివిధ పార్టీల నాయకులు జగ్జీవన్రాం కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జీవితమంతా దేశ సేవకు అంకితం చేసి నవ భారతనిర్మాణంలో నాలుగు దశాబ్దాలు అవిరాళ కృషి చేసిన మహోన్నతుడు బాబూజీ అని కొనియాడారు. బాబూజీ జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. ఎంపీగా, కేంద్ర మంత్రిగా, దేశ ఉప ప్రధానిగా దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయం అన్నారు. సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషిచేసిన గొప్ప సంస్కర్త అని అన్నారు.
కుల రహిత సమాజం కోసం , ఎస్సీ, ఎస్టీల శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడని అన్నారు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో జగ్జీవన్రాం ఉత్సాహాంగా పాల్గొనేవారని కీర్తించారు. తెలంగాణ రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉబేదుల్లా కొత్వాల్, మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్లు సురేంద్ర ప్రతాప్, మోహన్ రావు, జడ్పీ సీఈవో వెంకటరెడ్డి, ఆర్డీవో నవీన్, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి సుదర్శన్, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, వివిధ వివిధ ఉద్యోగ ఉద్యోగ ఉపాధ్యాయ కుల సంఘాల విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
దేవరకద్రలో..
దేవరకద్రలో( Devarakadra) జరిగిన బాబు జగ్జీవన్రాం వేడుకలను ఘనం నిర్వహించారు. బీఆర్ఎస్ ( BRS) నాయకుడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దొబ్బలి అంజనేయులు( Anjaneyulu) జగ్జీవన్రాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు కె.రాజు, ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్, మాజీ ఎంపీటీసీ జగన్మోహన్, కండక్టర్ చిన్న నర్సిములు, రాజు,రామాంజనేయులు, బాలు, రామకృష్ణ, సత్యనారాయణ, ప్రభాకర్, నాగరాజు,శ్రీను,రాము,హనుమంతు, నరేష్ పాల్గొన్నారు.
ఊర్కొండలో( Urkonda) ..
మండల కేంద్రంలో బాబు జగ్జీవన్ రాం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంఆర్పీఎస్( MRPS) జిల్లా నాయకులు గుడిగానిపల్లి రాజు మాదిగ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయంతి కార్యక్రమం లో నాగర్ కర్నూల్ జిల్లా బీజేపీ ఓబీసీ జిల్లా అధ్యక్షులు నిరంజన్ గౌడ్ , జిల్లా నాయకులు గుడిగానిపల్లి రాజు మాదిగ మాట్లాడారు. భారత దేశ స్వాతంత్ర పోరాటంలో బాబూ పాత్ర కీలకమైనది పేర్కొన్నారు. కార్యక్రమం మాజీ సర్పంచి మాక్యాల శ్రీను,ఎమ్మార్పీఎస్ నాయకులు పరమేష్, కొమ్ము శ్రీను, తాడెం చిన్న, నరేష్ ,రామ్ దేవరాజ్ ,శ్రీశైలం,పరుశురాం ,బీజేపీ నాయకులు దివాకర్,తదితరులు పాల్గొన్నారు.