భూత్పూర్: నియోజకవర్గంలో సాగు నీటి సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని దేవరకద్ర ఎమ్మె ల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కోరారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జలసౌద కార్యాలయంలో చీఫ్ ఇంజినీర్ రమేశ్‌ను ఎమ్మె ల్యే కలిశారు.
ఈ సందర్భంగా పర్దిన్పూర్ లిఫ్టు, ముచ్చింతల కాలువ పనులు, ఊక చెట్టు వాగుపై, మూసాపేట మండలంలోని నిజాల పూర్లోని పెద్ద వాగులపై చెక్‌డ్యాములను మంజూరు చేయాలని కొరగా ఇందుకు ఛీఫ్ ఇంజనీయర్ సుముఖత వ్యక్తం చేశారు.
సాగునీటి సాదనతోనే నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఈ నర్సింగరావు, భూత్పూర్ మున్సిపాలిటీ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, చినచింతకుంట ఎంపీపీ హర్షవర్ధన్‌రెడ్డి తదితరు లు పాల్గొన్నారు.