మహబూబ్‌నగర్‌టౌన్, అక్టోబర్ 15 : స్వచ్ఛ మహబూబ్‌నగర్‌గా తీర్చిదిద్దాడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఉన్నతాధికారులు, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్ ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి తిరుగుతూ తడి, పొడి చెత్తపై అవగాహన కల్పిస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్‌చైర్మన్ తాటి గణేశ్, వార్డు కౌన్సిలర్లు, అధికారులు, మహిళా సంఘాలు ఇప్పటికే అనేక సార్లు సమావేశాలు నిర్వహించి తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించారు. మున్సిపల్ పారిశుధ్య విభాగ అధికారులు రవీందర్‌రెడ్డి, వాణికుమారి, గురులింగం, హెల్త్ అసిస్టెంట్ వజ్రకుమార్రెడ్డిల పర్వవేక్షణలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి రోజు మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ 108 మెట్రిక్ టన్నుల చెత్త వెలువడుతుంది. స్వచ్ఛ మహబూబ్‌నగర్‌గా తీర్చిదిద్దడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలకు ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించారు. వాల్ పెయింటింగ్ వేయించారు. ఇప్పటికే పారిశుధ్య సిబ్బంది, జవాన్లు పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. తడి, పొడి చెత్తను వేరుగా ఇవ్వాలని సూచించారు.
చెత్త సేకరణకు స్వచ్ఛ ఆటోలు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలోని 49 వార్డుల్లో చేత్త సేకరణకు కోసం పురపాలిక శాఖకు ప్రత్యేక వాహనాలు ఉన్నాయి. 19 ట్రాక్టర్లు, ఒక డోజర్, జేసీబీ, డంపర్ లేజర్తోపాటు స్వీపింగ్ మిషన్ అందుబాటులో ఉన్నాయి. అలాగే ప్రతి ఇంటింటి తిరిగి తడి, పొడి చెత్త కోసం 54 స్వచ్ఛ ఆటోలు అందుబాటులో ఉన్నాయి.
ప్రతిరోజు వార్డులో తిరిగి చెత్త సేకరించి ప్రతి ఇంటి నుంచి రూ.40లు వసూలు చేస్తారు. ప్రతి వార్డులో వచ్చే స్వచ్ఛ ఆటోకు చెత్తను అందజేయాలని మున్సిపల్ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
పారిశుధ్యంపై దృష్టి సారించాలి
పారిశుధ్యం లోపించకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటు న్నాం. స్వచ్ఛ మహబూబ్‌నగర్‌గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తు న్నాం. ఇంటింటి చెత్తసేకరణ కార్యక్రమం చేపడుతున్నాం. వార్డులకు స్వచ్ఛ ఆటోలను కేటాయించాం. పురప్రజలు తడి, పొడి చెత్తను వేరుచేసి ఆటోకు అందజేయాలి. చెత్తను రోడ్లు, డ్రైనేజీల్లో వేస్తే జరిమానా విధిస్తాం. ప్రత్యేక బృందాలు నిరంతరం వార్డులో పర్యటిస్తారు. చెత్త వేసిన వారికి జరిమానా విధిస్తారు. పట్టణ ప్రజలు సహకరించి చెత్త రహిత పట్టణంగా తీర్చిదిద్దాడానికి సహకరించాలి.
– ప్రదీప్‌కుమార్,మున్సిపల్ కమిషనర్, మహబూబ్‌నగర్