జోగులాంబ గద్వాల : గద్వాల నియోజకవర్గంలో సర్పంచ్ పదవులకు వేలం ( Auction ) పాటలు కొనసాగుతున్నాయి. ఈసీ హెచ్చరించినా కూడా వేలం పాటలు బంధు కావడం లేదు. గద్వాల నియోజకవర్గంలో ( Gadwal constituency ) గురువారం మూడు పంచాయతీలకు వేలంపాట నిర్వహించి సర్పంచ్‌లను ఎన్నుకోగా శుక్రవారం కూడా మరికొన్ని పదవులకు వేలంపాటలు కొనసాగాయి.
గట్టు మండలంలో తారాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా తిమ్మప్ప అనే వ్యక్తి రూ. 16.20 లక్షలకు, ముచోనిపల్లి పంచాయతీ రూ. 14.90 లక్షలకు కురువ శేఖర్, మిట్టదొడ్డి పంచాయతీ సర్పంచ్ పదవిని రూ. 90 లక్షలకు కుమ్మరి శేఖర్ దక్కించుకున్నట్లు సమాచారం.
గద్వాల మండలం ఈడుగోనిపల్లి గ్రామ సర్పంచ్ పదవికి రూ. 9.80 వేలు, కురువపల్లె సర్పంచ్ పదవికి రూ. 45 లక్షలు, పుటాన్పల్లి సర్పంచ్ పదవికి రూ.15 లక్షలు, వీరాపురం సర్పంచ్ పదవికి రూ. 50 లక్షలు చెల్లించి సర్పంచ్ పదవులు కైవసం చేసుకున్నారు.
కేతి దొడ్డి మండలం ఓమ్మిత్యాల తండా సర్పంచ్ పదవికి రూ. 12 లక్షలు, రెండో విడత ఎన్నికలు జరిగే మల్దకల్ మండలం సద్దలోనిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఏకగ్రీవానికి రూ. 45 లక్షలు వేలం పాట పాడి పదవులు దక్కించుకున్నారు. ప్రజాస్వామ్యబద్దంగా జరుగవలసిని ఎన్నికలు అపహాస్యం చేస్తూ వేలం పాటల ద్వారా పదవులు దక్కించుకోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి .