నారాయణపేట : జిల్లాలోని మద్దూరు మండలం అచ్చంపల్లి గ్రామంలో ఓ మహిళపై కత్తితో ( Knife ) దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అచ్చంపల్లికి చెందిన అంజమ్మ ( Anjamma ) మంచినీటి కోసం కుళాయి వద్దకు రాగా అప్పటికే అక్కడ కాపు కాస్తున్న అంబటి లక్ష్మణ్ ( Ambati Laxman ) పదునైన కత్తితో ఆమె పై ఏడుసార్లు దాడి చేసినట్లు తెలిపారు.
కొద్ది రోజుల క్రితం అంబటి లక్ష్మణ్ బామ్మర్ది చనిపోగా అతడి పేరు మీద రైతు బీమా డబ్బులు మంజూరయ్యాయి. తనకు అప్పులు ఉన్నాయని, అప్పులు తీర్చేందుకు రైతు బీమా డబ్బులు రూ.5 లక్షలు ఇవ్వాలని అంబటి లక్ష్మణ్ కోరగా అందుకు లక్ష్మణ్ భార్య చిన్నమ్మ(అంజమ్మ) అడ్డు పడిందన్న కోపంతో కక్ష పెంచుకుని కత్తితో దాడి చేసినట్టు తెలిపారు.
ప్రస్తుతం అంజమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు అంబటి లక్ష్మణ్ పోలీసు స్టేషన్కు వచ్చి లొంగిపోయాడని మద్దూరు పోలీసులు తెలిపారు.