అచ్చంపేట రూరల్, ఫిబ్రవరి 9: అచ్చంపేట తాసీల్దార్ కార్యాలయంలో గురువారం అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పాత్లావత్ హనుమంతు, బొమ్మనపల్లి మాజీ సర్పంచ్ రాత్లావత్ బోడ్కానాయక్ 12 గంటల తరువాత తాసీల్దార్ కార్యాలయంలోని రికార్డు గదిలో పలు భూముల రికార్డులను తారుమారు చేసేందుకు ప్రయత్నించగా గమనించిన ప్రజాసంఘాలు, పార్టీల నాయకులు అడ్డుకొని పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో సీఐ రవీందర్, ఎస్సై రాములు కార్యాలయానికి చేరుకుని ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. అత్యవసర పనుల నిమిత్తం ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలున్నాయా అని ఆర్ఐ కృష్ణాజీని అడిగి తెలుసుకున్నారు. అ లాంటివేవీ లేవని ఆర్ఐ సమాధానం చెప్పారు.
ఈ విషయమై తాసీల్దార్ పాండూనాయక్ను వివరణ కోరగా బోడ్కానాయక్ తమకు సంబంధించిన కల్యాణలక్ష్మి పెండింగ్ పనులు చేయించుకోవడానికి హనుమంతుతో కలిసి కార్యాలయానికి వెళ్లినట్లు తె లిపారు. అర్ధరాత్రి వేళ ఆఫీసుకు వెళ్లడంతో జూనియర్ అసిస్టెంట్ హనుమంతుపై శాఖాపరమైన చ ర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు నివేదించినట్లు ఆ యన తెలిపారు. అదేవిధంగా ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చే యాలని అచ్చంపేట పోలీసులను ఆదేశించిన ట్లు తాసీల్దార్ పేర్కొన్నా రు. పోలీసులు పూ ర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే నే అసలు విషయం బ యటపడనున్నది. పెం డింగ్ పనుల పేరు చెప్పి అ ర్ధరాత్రి భూ రికార్డులు, కం ప్యూటర్ గదిలోకి చొరబడ డం పలు అనుమానాలకు తా విస్తున్నదని మండల ప్రజలు చర్చించుకుంటున్నా