మూసాపేట, నవంబర్ 30 : దేవరకద్ర నియోజకవర్గ వ్యాప్తంగా గురువారం జరిగిన అంసెబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఒకటి రెండు చోట్ల ఈవీఎంలు కొన్ని నిమిషాల పాటు మోరిం చినా అధి కారులు సరిచేయడంతో సాయంత్రం వరకు ఓటింగ్ ప్రశాంతంగా సాగాయి. ఉద యం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ రాత్రి 7 గంటలకు పైగా వరకు సాగింది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఓటు వేసి పోవాలన్న లక్ష్యం తో క్యూలో నిలబడి ఓటు వేశారు. దేవరక ద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నాసాగర్ గ్రా మంలో తన ఓటు హక్కును కుటుంబ సభ్యులతో పాటు కలిసి పోలింగ్ కేంద్రానికి వెళ్లి సద్విని యోగం చేసుకున్నారు. అనంతరం నియోజ వర్గంలోని ఆయా మండలాలోని పోలింగ్ కేంద్రా లకు వెళ్లి పోలింగ్ సరళిని పరిశీలించారు. కార్య కర్తలతో మాట్లాడు తూ ఓటింగ్ ఏలా సాగుతుందనే విషయా న్ని అడిగి తెలుసుకున్నారు.
భూత్పూర్, నవంబర్30: ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తన సొంత గ్రామం అన్నాసాగర్ లోని 20వ పోలింగ్ కేంద్రం లో గురువారం ఓటు హక్కు విని యోగిం చుకున్నారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తల్లి వరలక్ష్మీ, సతీమణి ఆల మంజుల, కూ తుళ్లు శృతిరెడ్డి, ప్రీతిరెడ్డి, అన్న ఆలశశి వర్ధన్‌రెడ్డి, వదిన శ్రీలక్ష్మి, అక్క గీతతో కలిసి క్యూలో వెళ్లి ఓటు వేశారు. జయశంక ర్ భూపాలపల్లి జిల్లా కోర్టు ప్రధాన న్యాయ మూర్తి నారాయణబాబు తన సొంత గ్రామంలో ఏవీఆర్ తండాలో తన ఓటు హక్కును వినియోగించు కున్నా రు. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియో గించుకో వాలనే ఉద్దేశ్యంతో వచ్చినట్లు ఆయన తెలిపారు.
భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఓటు వేసేందుకు ఉత్సాహంతో ఓటర్లు ఉదయం నుండే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి నిల్చి ఉన్నా రు. గురువారం మండల వ్యాప్తంగా 48పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓటు వేసేందుకు చాల మంది యువకులు, వృద్థులు ఉత్సాహంగా బారులు తీరారు. మున్సిపాలిటీ పరిధిలోని గోప్లా పూర్లో నవవధువు సంధ్య ఓటు వేయడానికి తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్‌లోని 2వ,పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రవికుమార్ పరిశీలించారు.
దేవరకద్ర, నవంబర్ 30: మండలంలో అసెం బ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశా యి. ఉపాధి, ఉన్నత చదువుల కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారు ఓటుహ క్కు వినియోగించుకోడానికి స్వగ్రామాలకు చేరుకోవడంతో గ్రామాల్లో పండుగ వాతా వరణం నెలకొంది. మండలం కేంద్రం లోని 105 పోలింగ్ కేంద్రంతో పాటు మండలం లోని జీన్గురాల గ్రామంలోని 140 , బల్సుపల్లి, గోపన్‌పల్లి గ్రామంలోని 145 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మోరించడంతో అధికారులు సరి చేసి అర్ధ గంట తర్వాత ఓటింగ్ ప్రారంభించా రు. దీంతో ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకు నేందుకు ఓటర్లు గంటల కొద్ది వేచి ఉండి ఓటు హక్కు విని యోగించుకు న్నారు. తొలిసారి ఓటుహ క్కు వినియోగించుకున్న యువత సంతో షంతో తమ అనుభూతి పంచుకున్నారు.
దేవరకద్ర రూరల్(కౌకుంట్ల) నవంబర్ 30: కౌకుంట్ల, చిన్న చింతకుంట మండలా ల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. చింతకుంట మండ ల కేద్రంలోని 201 పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరా యిండంతో అధికారులు 15 నిమిశాల్లో సరిచేసి ఓటింగ్ కొనసాగించారు. కొత్తగా ఓటు హక్కు వచ్చిన యువతీ, యువకులు ఉత్సాహంగా ఓటుహక్కును వినియోగించు కున్నారు.
కొత్తకోట, నవంబర్ 30: మండలంలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అప్పరాలలో ని 269 పోలింగ్ కేంద్రంలో ఉదయం ఈవీఎం మొరాయించడంతో అర్దగంట పాటు పోలింగ్ నిలిపి వేశారు. అనంతరం టెక్నిషియన్స్ వచ్చి సరి చేశారు. అలాగే అమడబాకుల గ్రామంలోని 269 పోలింగ్ కేంద్రంలో 15 నిమిషాల పాటు ఈవీఎం మొరాయించింది. కానాయపల్లి గ్రామం లో మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి దంపతులు ఓటు హక్కును వినియోగించు కున్నా రు. పట్టణంతో పాటు కానాయపల్లి, ముమ్మళ్లపల్లి, సంకిరెడ్డిపల్లి, మీరాసిపల్లి గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్ రెడ్డి సందర్శించి అధికారులు పోలింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. నాటవెల్లి గ్రామంలో పోలింగ్ కేంద్రాల వద్ద టెంటు ఏర్పాటు చేయకపోవడం తో మహిళలు ఎండలో ఇబ్బంది పడ్డారు. కనిమెట గ్రామంలోని 135వ పోలింగ్ కేంద్రానికి సాయంత్రం 5 దాటాక సుమారు 200 మందికి పైగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకు నేందుకు వచ్చారు. కొత్తకోట పట్టణం లోని ఉర్దూమీడియం పాఠశాల వద్ద సాయంత్రం స్వల్ప ఘర్షణ చోటు చేసుకున్నది.
మదనాపురం, నవంబర్ 30 : మండలంలో దేవరకద్ర నియోజక వర్గానికి సంబంధించి 26 పోలింగ్ కేంద్రాలు, మక్తల్ నియోజక వర్గానికి సంబంధించి 4 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. రామన్‌పాడు గ్రామం లో ఈవీఎం మొరాయించడంతో ఉదయం 7:50 ప్రారంభమైంది. మ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి దుప్పల్లి, కొత్తపల్లి, మదనాపురం, దంతనూ రు, శంకరమ్మపేట గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళలిని పరిశీలిం చారు. సాయంత్రం వరకు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.