వనపర్తిటౌన్, అక్టోబర్ 7 : తమపై పని భారాన్ని తగ్గించాలని ఆశవర్కర్లు డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని మర్రికుంట నుం చి కలెక్టరేట్ వరకు సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశవర్కర్లు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, ఆశవర్కర్ల సంఘం రాష్ట్ర నాయకురాలు విజయలక్ష్మి మాట్లాడారు.
ల్యాబ్ టెక్నిషియ న్ శిక్షణ పొందిన వారు మాత్రమే బీపీ, షుగర్ టెస్టులు చేయగలుగుతారని, కానీ ఆ పరీక్షలన్నీ ఆశవర్కర్లతో చే యించడం సరికాదన్నారు. రాష్ట్రంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి లేదని, వనపర్తి జిల్లాలోనే ప్రత్యేకంగా ఎందుకు చేయిస్తున్నారని ప్ర శ్నించారు. పెండింగ్లో ఉన్న సెప్టెంబర్ నెల జీతాన్ని వెం టనే చెల్లించాలని, టీఏ, 2023-24 పల్స్ పోలియో సర్వే లెప్రసీ సర్వే డబ్బులు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫిక్స్డ్ వేతనం రూ.18 వేలుగా నిర్ణయించాలన్నారు.
వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ ఆదర్శ్ సురభికి అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు నిక్సన్, ఆశవర్కర్ల యూ నియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బుచ్చమ్మ, సునీత, కోశాధికారి భాగ్య, ఇంద్ర, నాయకులు ఇందిర, సత్యమ్మ, గోవిందమ్మ, సుజాత, మంజుల, లక్ష్మీదేవి, కల్పన తదితరులు పాల్గొన్నారు.