నా భర్త ఏడాది కిందట చనిపోయిండు. నాకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. పెద్దబాబు టైలర్, ఇద్దరు మెకానిక్ పని చేస్తున్నారు. మాకు సొంత ఇల్లు కూడా లేదు. మా బంధువుల ఇంట్లో ఉంటున్నాం. ఇద్దరు కొడుకులకు పెండ్లిళ్లు అయ్యాయి. అందరం ఒకే దగ్గర నివసిస్తున్నాం. ఉన్న ఇల్లు సరిపోవడం లేదు. మూడో కొడుకుకు పెళ్లి చేస్తే ఇంకా కష్టంగా ఉంటుంది. ఇరుకు ఇంట్లోనే జీవిస్తున్నాం. మాకు వంద గజాల స్థలం ఉన్నది. పెరిగిన ధరలతో, నా కొడుకులు చేస్తున్న పనితో ఆ జాగలో ఇల్లు కట్టుకోలేకపోతున్నాం. ఇసుక, సిమెంట్, సీకుల ధరలు, మేస్త్రీ కూలీలు బాగా పెరిగాయి. నా కొడుకుల సంపాదన ఇంటి ఖర్చులకే సరిపోతున్నది. సొంతంగా ఇల్లు కట్టుకోవాలంటే డబ్బులు లేకపోవడంతో ఆశ కూడా పోయింది. సీఎం కేసీఆర్ సార్ సొంత ఇల్లు కట్టుకోనిక్కె రూ.3 లక్షలు ఇస్తారని తెలిసింది. మాకు ఇప్పటి వరకు ఏ
గవర్నమెంటోళ్లు సాయం చేయలేదు. ఇందిరమ్మ ఇల్లు కూడా రాలేదు. ఇప్పుడు ప్రభుత్వం గృహలక్ష్మి పథకంతో డబ్బులు ఇస్తే.. మరిన్ని పైసలు జమ చేసి ఇల్లు కట్టుకుంటాం. సొంత గూటిలో ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది.
– రజియా బేగం, రాంనగర్ కాలనీ, నాగర్కర్నూల్
గూడు లేని పేదలకు ప్రభుత్వం తీపికబురు అందించింది. జాగ ఉంటే ఇంటి నిర్మాణానికి సాయం చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకోసం గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షలు అందించ నున్నారు. నియోజకవర్గానికి 3 వేల ఇండ్ల చొప్పున తొలి విడుతలో 36 వేల మందికి లబ్ధి చేకూరనున్నది. రూ.లక్ష చొప్పున మూడు విడుతల్లో సాయం అందనున్నది. అయితే పాడుబడిన ఇండ్లు కూలిపోయిన వారికి సైతం ఈ పథకం వర్తించనున్నది. ఇందుకోసం త్వరలో ఆయా నియోజకవర్గాల్లో లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానుక ప్రకటించిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని చెబుతున్నారు.
– మహబూబ్నగర్, మార్చి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మహబూబ్నగర్, మార్చి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఇండ్లు లేని నిరుపేదల కు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందజేసిం ది. సొంత జాగాల్లో ఇండ్ల నిర్మాణం చేపట్టేందుకు ‘గృహలక్ష్మి’ పథకానికి శ్రీకారం చు ట్టింది. ఇల్లు కూలిపోయిన వారికి కూడా ఈ పథకం వర్తింపజేయాలని భావిస్తున్నది. ఈ పథకం కింద రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించనున్నారు. మహిళలనే లబ్ధిదారులుగా గుర్తించనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యా ప్తంగా ఈ పథకంపై చర్చ జరుగుతున్నది. రా ష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే డబుల్బెడ్రూం ఇండ్లను గూడులేని నిరుపేదలకు పంపిణీ చేసింది. తాజాగా సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో గృహలక్ష్మి పథకానికి బీజం పడడంతో పేదింటి ఆడబిడ్డలు ఆనందంలో ఉన్నారు. ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఇండ్ల చొప్పున.. మహబూబ్నగర్ జిల్లాకు 9 వేలు, నాగర్కర్నూల్ జిల్లాకు 12 వేలు, జోగుళాంబ గద్వాల జిల్లాకు 6 వేలు, వనపర్తి జిల్లాకు 3 వేలు, నారాయణపేట జిల్లాకు ఆరువేల ఇండ్లను కేటాయించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తొలి విడుతగా 36 వేల మంది లబ్ధిదారులకు గృహలక్ష్మి పథకం వర్తించనున్నది. ఆయా నియెజకవర్గాల్లో ఇండ్లు లేని నిరుపేదలను గృహనిర్మాణ శాఖ సిబ్బంది సర్వే ద్వారా గుర్తించి నివేదిక ఇవ్వనున్నారు. అనంతరం లబ్ధిదారుల ఎంపిక ఉండనున్నది
రూ.3లక్షల ఆర్థిక సాయం..
గృహలక్ష్మి పథకం కింద ఇండ్లు లేని పేదల కు ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించనున్నది. పూర్తిగా ఇల్లు లేకుండా ఖాళీ జాగా ఉన్నోళ్లకు ఈ పథకం వర్తించనున్నది. రూ.లక్ష చొప్పున మూడు విడుతల్లో ఇ వ్వనున్నది. దీంతో లబ్ధిదారులు తమకు ఇ ష్టం వచ్చినట్లు ఇల్లు కట్టుకునే వెసలుబాటు ఉంటుంది. పట్టణాలు, గ్రామాల్లో ఇల్లు కూలిపోయిన వారు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందొచ్చు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 36 వేల మందిని ఎంపిక చేయనున్నారు. ప్రతి ని యోజకవర్గంలో ఇల్లు లేని నిరుపేదలను గు ర్తించే ప్రక్రియ త్వరలో ప్రారంభం అవుతుందని గృహనిర్మాణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి విధివిధానాలు వ చ్చిన వెంటనే కార్యాచరణ మొదలుకానున్న ది. ఇల్లు లేకుండా జాగా ఉన్నోళ్లు తమ ప్లాట్ రిజిస్ట్రేషన్ కాగితాలతో దరఖాస్తులు చేయాల్సి ఉంటుంది. ఎలాంటి అవకతవకలకు ఆస్కా రం లేకుండా అర్హులైన పేదలకే ఈ పథకం వ ర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. గ తంలో టీడీపీ, కాంగ్రెస్ హయాంలో గృహ ని ర్మాణ శాఖ ద్వారా రుణాలు పొంది ఇల్లు ని ర్మించుకున్నా.. కిస్తులు కట్టలేకపోయిన పాత బకాయిలను మాఫీ చేస్తామని ప్రకటించడం తో ఊరట లభించింది. ఉమ్మడి జిల్లాలో చాలామందికి ప్రయోజనం కలగనున్నది.
మంచి ఇల్లు కట్టుకుంటా..
చాలా ఏండ్ల కింద మా ఇల్లు పడిపోయింది. అప్పు చేసి ఇల్లు కట్టుకునే ధైర్యం చేయలేక.. నా భర్త, ఇద్దరు కొడుకులు, ఒక కూతురుతో కలిసి అదే ఇంట్లో ఉంటున్నాం. వానకు నానుతూ, ఎండకు ఎండుతూ కష్టాలు పడుతున్నాం. సీఎం కేసీఆర్ సారు గిట్ల మాకు ఇల్లు కట్టుకోవడానికి దుడ్లు ఇస్తే మంచిగా నిర్మించుకుంటా. మాలాంటోళ్లకు సర్కార్ సాయం చేస్తదన్న నమ్మకం ఉన్న ది. సీఎం కేసీఆర్ సారును జన్మలో మర్చిపోం. – కొమ్ము మంజుల, పాతతోట, మహబూబ్నగర్
ఇది ఒక వరం..
మేము వ్యవసాయ కూలీలం. కూలి డబ్బులతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. చిన్న గుడిసెలో నివాసం ఉంటూ ఉన్న దాంట్లో సర్దుకుంటున్నాం. ఈ ఎండాకాలంలో డబ్బులు అప్పు తీసుకొని గుడిసె స్థానంలో రెండు గదులు నిర్మించుకుందామని అనుకున్నాం. అయితే, అప్పు ఎలా తీర్చాలని ఆలోచిస్తున్నాం. ఇంతలోనే జాగా ఉన్న వారికి ఇల్లు కట్టుకునేందుకు రూ.3 లక్షలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇది మాలాంటి పేదోళ్లకు ఊరట కలిగించనున్నది. గృహలక్ష్మి పథకం కింద తమకు గూడు నిర్మించుకునే అవకాశం ఏర్పడనున్నది. నిజమైన పేదలకు ఇది ఒక వరంలాంటిది. ఇలాంటి నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్కు తాము ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. నిరంతరం పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి పది కాలాలపాటు చల్లగా ఉండాలి.
– భాగ్యమ్మ, జమ్మిచేడు, గద్వాల మండలం
పేదల సమస్య తీరనున్నది..
నియోజకవర్గాల్లో ఎక్కడకు వెళ్లినా ఇల్లు ఇవ్వాలనే అడుగుతున్నారు. ఇల్లు కూలిపోయినా అందులోనే జీవనం సాగిస్తున్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లు అందరికీ ఇవ్వడం సాధ్యం కాకపోవడంతో ప్రభుత్వం గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది. దీంతో ఇండ్ల సమస్య చాలావరకు తీరనున్నది. ప్రభుత్వం ఇచ్చే రూ.3 లక్షలతో చక్కగా ఇల్లు నిర్మించుకోవచ్చు. నిజమైన లబ్ధిదారులను గుర్తించేలా చర్యలు తీసుకుంటాం. ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆడబిడ్డలు రుణపడి ఉంటారు.
– వీఎం అబ్రహం, ఎమ్మెల్యే, అలంపూర్
మహిళలకు గుర్తింపు..
పేదలకు ఇల్లు నిర్మించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3 లక్షలను ఆర్థిక సాయం చే స్తున్నట్లు ప్రకటించడం సంతోషంగా ఉన్న ది. సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకునేవారికి ఇది ఒక వరం. మహిళల పేరుపై గృహలక్ష్మి పథకం వర్తింపజేయాలనుకోవడంతో మహిళలకు ప్రత్యేక గుర్తింపు దక్కనున్నది. గృహలక్ష్మి పథకాన్ని మహిళా దినోత్సవం రోజున ప్రకటించడం హర్షించదగ్గ విషయం. అద్దె ఇంట్లో ఉంటున్న వారికి ఈ పథకంతో ఎంతో మేలు కలగనున్నది. పేద వారి సొంతింటి కలను నిజం చేస్తున్న సీఎం కేసీఆర్ నిజంగా దేవుడు. ఆయనకు యావత్తు మహిళాలోకం రుణపడి ఉంటుంది.
– మొగులమ్మ, పూసల్పహాడ్, మరికల్ మండలం
సీఎం కేసీఆర్కు అండగా ఉంటాం..
సొంత గూడు ఉండాలన్నది ప్రతి పేదవారి కల. ప్రస్తుతం పెరిగిన ధరలను బట్టి ఇల్లు నిర్మించుకోలేక.. కిరాయిలు కట్టలేక సతమతమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సొంత జాగా ఉన్న వారికి గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షలను ఇస్తున్నట్లు ప్రకటించడం సంతోషంగా ఉన్నది. ఈ పథకం కింద మా స్థలంలో చిన్న గూడు కట్టుకుంటాం. మాలాంటి వారికి ఇది ఓ వరం. పేదల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రభుత్వం, సీఎం కేసీఆర్ సారుకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం. – శైలజ, రాంనగర్ కాలనీ, వనపర్తి