మహబూబ్‌నగర్ కలెక్టరేట్, మే 10 : పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)లో చేరేందుకు సమయం ఆసన్నమైంది. 2026-27 విద్యా సంవత్సరానికి గా నూ ఈనెల 14వ తేదీ నుంచి జూన్ 8వ తేదీ వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో విభిన్న కోర్సులు ఉన్నాయి. విద్యార్థి అభిరుచికి అనుగుణమైన అంశాన్ని ఎంచుకునే వెసులుబాటు కల్పించారు. ఉన్నత వి ద్య చదవలేని వారికి ఈ కోర్సులు వరం అని చెప్పొచ్చు. పరిశ్రమలకు సంబంధించి ఉద్యోగ నియామకాల్లో ఐటీఐ చదివిన వారికే ప్రాధాన్యమిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఉ మ్మడి పాలమూరులో ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలు ఉన్నాయి. ఒక్కో దాం ట్లో 200 నుంచి 250కి పైగా సీట్లు అం దుబాటులో ఉన్నాయి. గతేడాది మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ ఐటీఐల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ (ఏటీసీ) ప్రారంభించారు.
రెండేళ్ల కోర్సులు : ఫిట్టర్, మెషినిస్ట్, టర్నర్, డ్రాప్టమెన్ సివిల్, మెకానికల్ మోటార్ వెహికల్ ఏడాది కోర్సులు : డీజిల్ మెకానిక్, కోపా (కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ ఎనలిస్ట్). ఏటీసీలో : సీఎన్సీ మాచినింగ్ టెక్నీషియన్, ఇంజినీరింగ్ డిజైన్ టెక్నీషియన్, ఇండస్ట్రీయల్ రోబోటిక్స్, డిజిటల్ మాన్యుప్యాక్చరింగ్ టెక్నీషియన్, మ్యానుప్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్, ఆటోమేషన్ టెక్నీషియన్, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికిల్, వర్చువల్ ఎనలిసిస్ట్ డిజైనర్-ఎఫ్ఈఎం, కొన్ని స్వల్పకాలిక కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
అవసరమైన పత్రాలు : ఎస్ఎస్సీ మెమో, బోనఫైడ్ సర్టిఫికెట్, టీసీ, కుల, ఆదాయ ధ్రువపత్రాలు, ఆధార్‌కార్డు, ఈమెయిల్ ఐడీ, ఫొటోలు, మొబైల్ నెంబరు ఉండాలి
ఆన్లైన్ నమోదు : ప్రభుత్వ ఐటీఐలో చేరే విద్యార్థులు ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆసక్తి ఉన్నవారు https:///iti.telangana.gov.in వెబ్సైట్లో వివరాలు నమోదు చేయా లి. కోర్సు ప్రాతిపాదికన వెబ్ ఆప్షన్లు ఎంచుకుని నిజ ధ్రువపత్రాలు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, వెబ్ ఆప్షన్ల ప్రకారం సీ ట్లు కేటాయిస్తారు. దరఖాస్తు సమయం లో ఉపయోగించే మొబైల్ నెంబ ర్ ఈ మెయిల్‌ను కోర్సు పూర్తయ్యేవరకు కొనసాగించాలి. ఐటీఐ, ఏటీసీల్లోని కోర్సులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పూర్తి వివరాల కోసం కళాశాలలో సంప్రదించాలని సూచించారు.