అయిజ, జూన్ 4 : మండలంలోని పులికల్ ఐకేపీ ధాన్యం కేంద్రానికి ఏపీలో ని కర్నూల్ జిల్లా, నందవరం మం డలం, నాగల్దిన్నె నుంచి ఓ రైతు ధా న్యం తరలించారు. బుధవారం నాగల్దిన్నెకు చెందిన ఓ రైతు దాదాపు 35 క్విం టాళ్ల ధాన్యంను ట్రాక్టర్లో తరలించి, ఐకేపీ కేంద్రంలో విక్రయించేందుకు సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న రైతులు కొనుగోలు కేంద్రానికి చేరుకొని ఏపీ ధా న్యంను ఇక్కడ ఎలా కొనుగోలు చేస్తారని నిర్వాహకులపై మండిపడ్డారు. ఏపీ నుం చి వచ్చిన ధాన్యంను కొనుగోలు చేయరాదని అడ్డుకున్నారు.
అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఏఈవో శివకుమార్ నాగల్దిన్నె రైతుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నారు. నాగల్దిన్నెకు చెందిన రైతు రంగయ్యశెట్టికి పులికల్ గ్రామంలో 3 ఎకరాల భూమి ఉం దని, ఆయన పంట దిగుబడి రాగానే ఏపీలోని నాగల్దిన్నెకు తరలించారని, తిరిగి ఇప్పుడు కొనుగోలు కేంద్రానికి తీసుకురావడం నిబంధనలు ఒప్పుకోవని ఏఈవో తెలిపారు. ప్రస్తుతానికి ఓ ట్రాక్టర్ ధాన్యం ను నాగల్దిన్నెకు తిప్పిపంపామని, మరికొంత ధాన్యం కేంద్రంలోనే ఉండిపోయిందని పేర్కొన్నారు. ఇదే విషయమై ఉన్నతాధికారులకు నివేదికను పంపామని ఆయన వివరించారు.