పెబ్బేరు, అక్టోబర్ 13: కొత్తగా ఓటర్ల నమోదుకు కేంద్ర ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. ఈనెల 9 వ తేదీన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 4న ఓటరు లిస్టు ప్రకటించినప్పటికీ, షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా చివరి అవకాశంగా ఈనెల 31వతేదీ వరకు ఓటరు న మోదుకు గడువు పెంచింది. కేవలం ఫారం-6 ద్వారా కొత్త ఓటర్ల నమోదుకు మాత్రమే అవకాశం కల్పించింది. ఇప్పటికే నియోజకవర్గంలో 2,65,622 మంది ఓటర్లు ఉండగా త్వరలో ఓటర్ల సంఖ్య మరింత పెరగనున్నది.
ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల షె డ్యూల్ విడుదలైనప్పటికీ.. కొత్త ఓటర్ల నమోదుకు కేంద్ర ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. ఓటరు నమోదుకు ఈ నెల 31 చివరి గడువుగా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఎవరైనా ఓటరుగా నమో దు కాని వారికి ఇదొక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సం బంధించి ఎన్నికల సంఘం ఈ నెల 9న షెడ్యూల్ ప్రకటించింది. ఆ ప్రకారంగా నవంబర్ 30న తెలంగాణలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే యంత్రాంగం సెప్టెంబర్ 19 వరకు ఓటరు నమోదుకు, మార్పులు చేర్పులకు అవకాశమిచ్చింది. ఆ దరఖాస్తులు అన్నింటినీ పరిగణలోకి తీసుకొని అక్టోబర్ 4న ఓటరు లిస్టు ప్రకటించింది. అయినప్పటికీ, షెడ్యూలు వచ్చిన తర్వాత కూడా చివరి అవకాశంగా ఓటరు నమోదుకు మళ్లీ గడువు పెంచింది. ఈ గడువులో ఫారం-6 ద్వారా కొత్త ఓటర్ల నమోదు మాత్ర మే జరుగుతుంది. ఫారం 7, 8ల ద్వారా మార్పులు, చేర్పులకు అవకాశం ఇవ్వలేదు. ఫారం 6 ద్వారా ఆన్లైన్లో గానీ, నేరుగా బూత్ లెవల్ అధికారుల ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. అక్టోబర్ 4న విడుదలైన ఓట రు లిస్టు పోలింగ్ కేంద్రాల వారీగా ఉండగా, ఇప్పుడు కొత్తగా నమోదయ్యే వారి లిస్టు సప్లిమెంటుగా ప్రచురిస్తారని అధికార వర్గాలు చెప్పాయి. 2023 అక్టోబర్ 1వ తేదీ నాటికి 18 సం వత్సరాలు నిండిన వారు 31వ తేదీ వరకు ఆధార్కా ర్డు, వయసు ధ్రువీకరణ పత్రం అందజేస్తే మరో నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకొనే సువర్ణావకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది.
మొత్తం ఓటర్లు 2,65,622 మంది
ఎన్నికల సంఘం ఈ నెల 4న ప్రచురించిన ఓటరు జాబితా ప్రకారం వనపర్తి నియోజకవర్గంలో మొత్తం 2,65,622మంది ఓటర్లున్నట్లు తేలింది. ఇందులో పురుషులు 1,32,971మంది కాగా, మహిళలు 1,32,644మంది, ఇతరులు ఏడుగురు ఉన్నారు. ప్రస్తుతం ఓటరు నమోదుకు గడువు పెంచడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. గడువు విషయమై అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహిస్తే మంచి ఫలితాలుంటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.