జడ్చర్ల టౌన్, జూన్ 9 : పురాతన జైన శాసనాలను కా పాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి అన్నారు. ఆదివారం జడ్చర్ల మున్సిపాలిటీలోని వేంకటేశ్వరస్వామి ఆలయం, కావేరమ్మపేట మున్సిపల్ కార్యాలయ ఆవరణలో క్రీ.శ. 12వ శతాబ్ది పురాతన శాసనాల ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ కావేరమ్మపేట మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఉ న్న శాసనం క్రీ.శ. 1125వ సంవత్సరం జనవరి21వ తేదీ నాటిదని తెలిపారు. నాటి కళ్యాణి చాళుక్య చక్రవర్తి మూ డో సోమేశ్వరుని కుమారుడు కందూరునాడు యువరాజు మూడో తైలపుడు పాలించిన క్రమంలో మూల సంఘానికి చెందిన మేఘచంద్ర భట్టారకుడు వేయించిన శాసనం గా వివరించారు.
ఇందులో గంగాపురంలోని పార్శనాథ చైత్య ఆలయ ప్రస్థావన ఉన్నట్లు తెలిపారు. గంగాపూర్ శివారులోని గొల్లత్తగుడి ఇటుక ఆలయం జైన చైత్యాలయమని తెలిపారు. అలాగే వేంకటేశ్వరస్వామి ఆలయంలో క్రీ.శ. 1162 నాటి కందూరు చోళ వంశానికి చెందిన రెండో ఉదయన చోలుడు, కోడూరు స్వయంభూ సోమేశ్వరననాథుని నిత్య అర్చనలకు 5 గోకర్ణ సింగ రూకలను, గంగాపురం నుంచి వచ్చే ఆదాయాన్ని దానం చేసినట్లుగా శాసనంలో ఉన్నదన్నారు. పురాతన శాసనాలను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట అఖిలభారత ప్రాచీన ఆలయ జీర్ణోద్ధరణ ట్రస్ట్ చైర్మన్ ఆర్.కె.జైన్, కోచైర్మన్ ముఖేశ్కుమార్జైన్, ఆలయ పూజారి తదితరులు పాల్గొన్నారు.