కొత్తకోట : పట్టణంలో నిర్మిస్తున్న శ్రీ హరిహర పుత్ర ధర్మశాస్త్ర అయ్యప్ప క్షేత్రం ( Ayyappa Temple ) ఆలయ నిర్మాణానికి కొత్తకోట పట్టణానికి చెందిన ఆనంద్ జ్యూవెల్లర్స్ ( Anand Jewellers ) వారు మదన్ కుమార్ జ్ఞాపకార్థం నారాయణ్ దాస్ లీల, నారాయణ్ దాస్ ఆనంద్ దంపతులు , వారి కుమారులు నారాయణ్ దాస్ ,సుధీష్ణ, అరుణ్ కుమార్ దంపతులు రూ. 2,51,116 విరాళాన్ని( Donations ) ప్రకటించారు.
ఈ విరాళాన్ని అయ్యప్ప సేవాసమితి గురుస్వాములు గజ్జల శ్యామ్ సుందర్ గౌడ్ , కన్నారెడ్డి ఉమా మహేశ్వర రెడ్డి వారి చేతులమీదుగా అయ్యప్ప సేవాసమితి సభ్యులు విశ్వనాథం గంగాధర్ , బలిజ లింగేశ్వర్ , సత్యం సాగర్ , లక్ష్మీ నారాయణ యాదవ్ , వేముల సంతోష్ , కృష్ణయ్య చారి , భీమ కిషోర్లకు అందజేశారు. ఈ సందర్భగా అయ్యప్ప సేవాసమితి సభ్యులు దాతలను శాలువాతో సన్మానించారు.