పెబ్బేరు, ఏప్రిల్ 3 : పెబ్బేరు మార్కెట్ యార్డులోని గోదాంలో జరిగిన భారీ అగ్నిప్రమాదానికి గల కారణాలను మూడు రోజులైనా అధికారులు ఇంకా తేల్చలేకపోయారు. సోమవారం మధ్యాహ్నం మంటలు అంటుకోగా.. బుధవారం సాయంత్రం వరకు అవి కొనసాగుతూనే ఉన్నాయి. మూడు ఫైర్ ఇంజన్లతో రాత్రీపగలు తేడా లేకుండా మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. ఇంకా అగ్నికీలలు శాంతించడం లేదు. మొద ట గన్నీ బ్యాగుల కట్టలకు నిప్పు అంటుకోవడంతో ప్ర మాదం సంభవించింది. ఈ ఘటనలో 12.80 లక్షల బ్యాగులు బూడిద కుప్పగా మారాయి. కాలిన బ్యాగుల కట్టలను జేసీబీల సాయంతో బయటకు తీసి వేస్తున్నప్పటికీ ఇంకా గోదాం లోపల బ్యాగులు కాలుతూ కనిపిస్తున్నాయి. ఆ బ్యాగులను బయటకు తీయాలంటే అగ్నికి ధ్వంసమైన గోదాం పైకప్పు, గోడలు మీద పడే అ వకాశాలుండడంతో అధికారులు వెనుకంజ వేస్తున్నా రు. మరో పక్క బయటకు తీసిన బ్యాగులను ఆర్పుతున్నప్పటికీ వాటి నుంచి మళ్లీ పొగలు వస్తుండడం వల్ల పనులు ముందుకు సాగడం లేదు.
అగ్ని ప్రమాదంలో ఐదు వేల మెట్రిక్ టన్నుల సా మర్థ్యం కల్గిన గోదాం దాదాపు పూర్తిగా ధ్వంసమైంది. గోదాంపై ఉన్న రేకుల కప్పు కాలి కిందకు పడిపోయిం ది. సహాయ చర్యల కోసం గోదాం గోడలను కూల్చి వే యడంతో గోదాం మొత్తం పనికిరాకుండా పోయినట్లే. ఈ నేపథ్యంలో ప్రమాదానికి గల కారణాలను తేల్చేందుకు అవసరయ్యే ఆధారాలు కూడా కాలి బూడిదైనట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. గోదాంకు విద్యుత్ సరఫరా లేకపోవడంతో షార్ట్ సర్క్యూట్‌కు అవకాశం లేదు. ఎవరైనా నిప్పును వేశారా అంటే షట్టర్లు, కిటికీలు అన్నీ గట్టిగా మూత పెట్టి ఉండడంతో అదీ సాధ్యం కాదు. దీంతో ప్రమాద కారణం మిస్టరీగా కనిపిస్తున్నదని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. గోదాంలో మూడు కంపార్టుమెంట్లు ఉండగా మొదటి, రెండో కంపార్ట్మెంట్లలో స్థానిక మిల్లర్లు 70 వేల బస్తాల సీఎంఆర్ ధాన్యాన్ని నిల్వ ఉంచారు. రెండో కంపార్టుమెంట్లో మార్కెటింగ్‌శాఖ గన్నీ బస్తాల కట్టలను ఉంచగా, మొదట ఈ కంపార్టుమెంట్కే నిప్పంటుకున్నది. ధా న్యం బస్తాలు 20 శాతం కాలిపోగా, మిగిలిన బస్తాలను గోదాం నుంచి లారీల ద్వారా తరలిస్తున్నారు. గన్నీ బ స్తాలు, ధాన్యం, గోదాం మొత్తం కలిపి రూ.15 కోట్ల వరకు నష్టం సంభవించిందని అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.