బిజినేపల్లి, మార్చి 20 : నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెం గ్రామంలోని ప్రభుత్వ దవాఖాన ఆవరణలో ఉన్న అంబులెన్స్ దగ్ధమైంది. స్థానికుల కథనం మేరకు.. గతంలో పాలెం దవాఖాన పరిధిలోని ప్రాంతాల్లో వృద్ధుల ఆరోగ్య పర్యవేక్షణ కోసం.. ఆలనా పేరుతో అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు.
కాగా ఇటీవల దానిని ఉపయోగించకపోవడంలో దవాఖాన ఆవరణలో ఓ వైపు నిలిపారు. కాగా బుధవారం రాత్రి సమయంలో ప్రమాదవశాత్తు నిప్పంటుకొని దగ్ధమైంది. సమాచారం అందడంతో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు. అప్పటికే అంబులెన్స్ పూర్తిగా కాలిపోయింది.