కొత్తకోట : మానవ జన్మ ఎంతో ఉత్తమమైనదని శ్రీ మహానంద మలికిదేశిక స్వాములవారి ఆచాల గురు ఆశ్రమం పీఠాధిపతులు, వనపర్తి జిల్లా అధ్యక్షులు ధూపం సాంబశివుడు ( Sambasivudu ) అన్నారు. ఆదివారం వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రం వడ్డేవాట రోడ్డులోని బ్రహ్మంగారి మఠం వద్ద అమావాస్య పూజలు (Amavasya pujas) నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవులకు అధిక ఆశ ఆనందాన్ని ఇవ్వదని , అలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక వైపు అడుగులు వేయాలని సూచించారు. ఈ సందర్భంగా బృహస్పత్తి హోమం, గురుపూజ, పంచమృతాలతో అభిషేకం, ధూప,దీప నైవేద్యాలతో మహా మంగళహారతి భజన కార్యక్రమం నిర్వహించారు. అన్నదాతలు వారిచే అన్నదానం నిర్వహించారు.
అనంతరం వేద గురువులద్వారా వేదాంత మహాసభ భజనలు నిర్వహించారు. కొత్తకోట పట్టణ గురుదత్త దేవాలయం వ్యవస్థాపకులు వెంకటరమణయ్య శెట్టి , సుగుణమ్మ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా మిత్ర కంటి హాస్పిటల్ వైద్యులతో ఉచిత కంటి పరీక్షలు, బీపీ, షుగర్ పరీక్షలు ఉచితంగా నిర్వహించారు.