మరికల్, జులై 13 : మహబూబ్నగర్ జిల్లా మరికల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1983-84 లో పదవ తరగతి చదువుకున్న విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని (Alumni reunion)నిర్వహించారు. తాము చదువుకున్న పాఠశాలలో ప్రార్థనలు చేసిన అనంతరం విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కొంతమంది ఉపాధ్యాయులతో పాటు కలిసి చదువుకున్న విద్యార్థులు మృతి చెందడంతో వారి ఆత్మ శాంతికై రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం పాఠశాల తరగతి గదుల్లో తాము చేసిన చిలిపి చేష్టలను, గత మధురస్మృతులను నెమరు వేసుకున్నారు.
వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ వారు మళ్లీ 41 ఏళ్ల తర్వాత ఒకే చోట కలుసుకోవడం వారి ఆనందానికి అవధులు లేవు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము చదువులమ్మ నీడలోన అంటూ వృత్తి రీత్యా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన ఒకే చోట కలుసుకోవడం తమకు ఆనందంగా ఉందని, తమకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులను సన్మానించి వారి ఆశీర్వాదం పొందడం తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు చంద్రశేఖర్, హరి ప్రసాద్, వెంకటేశ్వర్లు, సదన్ రావు, శ్రీరాములు, తిరుపతి రెడ్డి, వీరభద్రప్ప, మక్సుద్, ఉమాదేవి, తిరుపతమ్మ, భీమేష్, ప్రసాద్ నాయుడు, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.