అయిజ, ఫిబ్రవరి 15 : బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎల్లప్పుడూ పార్టీ అండగా ఉంటుందని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. గురువారం మండలంలోని రాజాపురం గ్రామానికి చెందిన క్రియాశీల కార్యకర్త పెద్దయ్య కుటుంబానికి రూ.2లక్షల బీమా చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్లో క్రియాశీల సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు బీమా పథకం వర్తింపజేస్తుండడంతో మృతిచెందిన కార్యకర్తల కు టుంబాలకు భరోసా లభిస్తుందన్నారు. దేశంలో ఏ పార్టీ అమలు చేయని విధంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కార్యకర్తల సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ బలోపేతానికి ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించాలన్నారు.
క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని ఎ మ్మెల్యే విజయుడు అన్నారు. టీటీదొడ్డిలో గుండ్ల భీ మరాయుడు బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఓపెన్ ఆల్ కబడ్డీ, సందెరాళ్లు ఎత్తే పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ క్రీడలు అంతరించిపోకుండా ఉండేందుకు ఓపెన్ ఆల్ కబ డ్డీ పోటీలను నిర్వహించడం సంతోషకరమన్నారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీక రించాలన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ స భ్యులు, క్రీడాకారులు, నాయకులు పాల్గొన్నారు.