అలంపూర్, డిసెంబర్ 26 : గ్రామాలను పార్టీలకతీతంగా అభివృద్ధి చేసుకుందామని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. మంగళవారం మండలంలోని క్యాతూరు గ్రామంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి నిధుల నుంచి మంజూరైన రూ.5లక్షలతో వాల్మీకి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి, గ్రామంలోని మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. అదేవిధంగా లింగమన్నస్వామి ఆలయ నిర్మాణానికి చేపట్టిన భూమిపూజ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ మండల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.