అయిజ, ఆగస్టు 23 : ఆపదలో ఎవరూ అధైర్యపడొద్దని, అండగా ఉంటామని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. శుక్రవారం అయిజతోపాటు మండలంలోని పలు గ్రామాలకు చెందిన శస్త్ర చికిత్స చేయించుకునే బాధిత కుటుంబాలకు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డితో కలిసి ఎమ్మెల్యే ఎల్వోసీ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, పాల్గొన్నారు.
ఉండవెల్లి, ఆగస్టు 23 : ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటామని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. మండల కేంద్రానికి చెందిన జయలక్ష్మి అనారోగ్యంతో చికిత్స పొందుతున్నది. ఇందుకోసం రూ.3.50 లక్షల ఎల్వోసీ చెక్కును ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో శుక్రవారం బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే అంద జేశారు. కార్యక్రమంలో పీఏసీసీఎస్ చైర్మన్ గజేందర్రెడ్డి, మత్స్య సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు గోపాల్, రఘురెడ్డితోపాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.