అయిజ/అయిజ రూరల్, జూలై 19 : నిరుపేద కు టుంబాల్లోని బాధితులు కార్పొరేట్ వైద్యం చేయించుకునేందుకు సీఎంఆర్ఎఫ్ వరమని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. శుక్రవారం మండలంలోని మేడికొం డ, ఉత్తనూర్, రాజాపురం, కొత్తపల్లి, భూంపురం తదితర గ్రామాల్లో బాధితు ల ఇండ్లకు వెళ్లి సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం సహాయనిధి ద్వారా ని యోజక వర్గంలోని ఎంతోమందికి లబ్ధి చేకూర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా చిన్నతాండ్రపాడు గ్రామానికి చెందిన వివేకానందకు రూ.60వేలు, ఎక్లాస్పురం గ్రామానికి చెందిన సుభద్రమ్మకు రూ.58వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశా రు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు నర్సింహారెడ్డి, రాముడు, రంగారెడ్డి, మల్లికార్జున్రెడ్డి ఉన్నారు.