అలంపూర్ చౌరస్తా, నవంబర్ 25 : నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తానని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. సోమవారం అలంపూర్ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని పలు గ్రా మాల లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడు తూ నియోజకవర్గంలో ప్రజలకు ఏ సమస్య ఉ న్నా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు కృ షి చేస్తానన్నారు.
మానవపాడు, జల్లాపురం, బో రవెల్లి, మద్దూరు, పెద్ద ఆముదాలపాడు, అమరవాయి, శ్రీనగర్, కొర్విపాడు, పెద్ద పోతులపాడు, ఏ బూడిదపాడు, బొంకూరు, మెన్నిపాడు ఇతర గ్రామాలకు చెందిన 29మంది లబ్ధిదారులకు సీ ఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన రూ.7.62 లక్షల చెక్కులను పంపిణీ చేశామన్నారు. కార్యక్రమం లో సత్యారెడ్డి, మానవపాడు మాజీ ఎంపీపీ అశోక్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, గొల్లవెంకట్రాముడు, కర్ణసింహారెడ్డి, సూర్యవర్ధన్రెడ్డి, నాగేశ్వర్‌రెడ్డి, సుగుణాకర్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.