ఉండవెల్లి, మే 1 : రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను నిం డా ముంచిందని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అన్నారు. బుధవా రం అలంపూర్ చౌరస్తాలోని ఓ ఫంక్షన్ హాల్లో పా ర్లమెంట్ ఎన్నికలపై ఉండవెల్లి, మానవపాడు మం డలాల బీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశం ని ర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఆరు గ్యారెంటీలు ఎక్కడ అమలవుతున్నాయో ప్రజలు గమనించాలన్నారు.
ఈ ప్రభుత్వం రుణమాఫీ, రైతుబంధు, రైతుబీమా, 24గంటల ఉచిత విద్యుత్, కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారు త దితర హామీలేవీ అమలు చేయడం లేదని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉన్నారు. పదేండ్లలో కనిపించని కరువు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే కరువు కాటకాలకు నిలయమైందని విమర్శించారు. నడిగడ్డ బిడ్డ ఆర్ఎస్పీని కేసీఆర్ ఎంపీ అభ్యర్థిగా నిలిపారని, ఆయన గెలుపునకు అందరం సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ముఖ్యనాయకులు పాల్గొన్నారు.