Alai-Balai | అలయ్-బలయ్‌తో బీఆర్ఎస్ కార్యకర్తల్లో నయా జోష్
Alai-Balai | సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలోని జీఎల్ఆర్ గార్డెన్స్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ‘అలయ్-బలయ్ ’ వేడుకలు ఘనంగా జరిగాయి.
రాయపోల్ : సిద్దిపేట జిల్లా రాయపోల్ ( Rayapole ) మండల కేంద్రంలోని జీఎల్ఆర్ గార్డెన్స్‌లో బీఆర్ఎస్ ( BRS ) పార్టీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ‘అలయ్-బలయ్ ’ ( Alai-Balai ) వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ( MLA Kotha Prabhakar Reddy ) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పండుగ వాతావరణం లో సాగిన ఈ కార్యక్రమం బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.


తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే అలయ్-బలయ్ వేడుకలు ప్రజల మధ్య సోదరభావం, ఐక్యతను పెంపొందించడంతో పాటు సామాజిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని నాయకులు పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
రానున్న ఎంపీటీసీ. జడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించాలని ఎమ్మెల్యే కార్యకర్తలకు దశా దిశా నిర్దేశించారు. కార్యక్రమంలో మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు రేకుల నర్సింహారెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, మండల యువజన నాయకులు గల్వ దయాకర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు రాజిరెడ్డి, ఇప్ప దయాకర్ , మండల మాజీ కోఆప్షన్ సభ్యులు పర్వేజ్ అహ్మద్, సర్పంచులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Alai-Balai | అలయ్-బలయ్‌తో బీఆర్ఎస్ కార్యకర్తల్లో నయా జోష్
Ashutosh Dixit | ఐఏఎఫ్ చీఫ్‌గా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ బాధ్యతల స్వీకారం
సారపాకలో ముమ్మరంగా ఓటరు నమోదు
AP News | ఏపీకి మరో తుపాను ముప్పు.. భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ
AP News | ఎన్నికల వేళ చంద్రబాబు సర్కారు దుర్మార్గాలు చేస్తోంది : పేర్ని నాని
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

