AP News | ఎన్నికల వేళ చంద్రబాబు సర్కారు దుర్మార్గాలు చేస్తోంది : పేర్ని నాని
AP News | ఆంధ్రప్రదేశ్లో రేపు మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. దాంతో అక్కడి రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని అధికార కూటమి దుర్మార్గాలకు పాల్పడుతోందని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆరోపణలు చేశారు.
AP News : ఆంధ్రప్రదేశ్లో రేపు మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. దాంతో అక్కడి రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని అధికార కూటమి దుర్మార్గాలకు పాల్పడుతోందని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తప్పుడు మార్గాల్లో ఏకగ్రీవాలు సాధించి, కూటమి బలంగా ఉందని చూపించుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, చంద్రబాబే అన్నీ గెలిచారని బిల్డప్ ఇచ్చుకోవడం కోసమే ఈ దుర్మార్గాలు చేస్తున్నారని నాని విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని పేర్ని నాని మండిపడ్డారు. బీసీ కులగణన చేపట్టకుండా, ఓట్లు తక్కువగా ఉన్నాయని చూపిస్తూ రిజర్వేషన్లలో అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. పలు మండలాల్లో దళితులకు ఎంపీపీ సీట్లు రిజర్వ్ చేయలేదని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో పేర్ని నాని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని వైసీపీ నేతలు అధికార పార్టీపై ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు వైసీపీ నేతలే హింసను ప్రేరేపిస్తున్నారని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది. కాగా రేపు పోలింగ్ నేపథ్యంలో ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

