AP News | ఏపీకి మరో తుపాను ముప్పు.. భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ
AP News | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో తుపాను ముప్పు పొంచి ఉన్నది. ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసరాల్లోని అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ఇది రేపు (ఆదివారం) సాయంత్రానికి తుపానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.
AP News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో తుపాను ముప్పు పొంచి ఉన్నది. ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసరాల్లోని అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ఇది రేపు (ఆదివారం) సాయంత్రానికి తుపానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతున్న ఈ వాయుగుండం.. సోమవారం సాయంత్రానికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలోకి చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ వాయుగుండం ప్రభావంతో ఏపీ అంతటా విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సోమ, మంగళవారాల్లో సెంట్రల్ ఆంధ్రా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను అప్రమత్తం చేసింది. తుపాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని తెలిపింది.
అందువల్ల మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలో వేటకు వెళ్లరాదని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని ఏపీఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. అధికార యంత్రాంగం అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటోందని, ప్రజలు కూడా ప్రభుత్వ సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీకి మరో తుపాను ముప్పు.. భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ
AP News | ఎన్నికల వేళ చంద్రబాబు సర్కారు దుర్మార్గాలు చేస్తోంది : పేర్ని నాని
కూలీలు ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి: జడ్పీ సీఈవో నాగలక్ష్మి
‘టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి’
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

