భూత్పూర్, ఫిబ్రవరి 16 : ఏడాదిన్నర కాంగ్రెస్ చేతగాని పాలనకు ప్రజలు విసిగి వేసారారని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా గులాబీ జెండా ఎగరడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అ న్నారు. ఆదివారం మద్దిగట్లలో కాంగ్రెస్ పార్టీకి చెం దిన నాయకులు బాలస్వామి, తిరుపతయ్య, సుం కరి పెంటయ్య, వెంకటయ్య, మల్లయ్యతోపాటు ప లువురు బీఆర్ఎస్ చేరారు.
ఈ సందర్భంగా ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు నచ్చక బీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలోనే సకలజనులు అభివృద్ధి చెందినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, నాయకులు సత్తూర్ నారాయణగౌ డ్, నర్సింహాగౌడ్, సత్యనారాయణ, మురళీధర్గౌ డ్, నర్సింహ్మారెడ్డి, చెన్నయ్యతోపాటు తదితరులు పాల్గొన్నారు.