Ala venkateshwar reddy | పెద్దవాగు వెంట రైతులతో ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాదయాత్ర.. వివరాలివే
Ala venkateshwar reddy | దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాదయాత్ర ద్వారా రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యలను తెలుసుకోనున్నారు. పెద్దవాగుకు వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేయనున్నారు.
Ala Venkatreddy| కృష్ణా నీళ్లతో కేసీఆర్ జీవం పోసిన పెద్దవాగుకు కప్పెట,పోల్కంపల్లి నుండి సరళాసాగర్ వరకు సాగునీటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతుల పక్షాన పోరాటానికి సిద్ధమైన బీఆర్ఎస్ సిద్దమైంది. దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అక్టోబర్ 23న శుక్రవారం ఉదయం 8:30 గంటలకు నిజాలపూర్ దగ్గర ప్రారంభమై పెద్దవాగు వెంట రైతులతో కలిసి పాదయాత్ర చేయనున్నారు. దేవరకద్ర గులాబీ సైన్యం
చెక్ డ్యామ్ ల వెంట రైతులతో కలిసి కదం తొక్కనుంది. పోల్కంపల్లి, తిమ్మాపుర్, నిజలాపూర్, సంకల్ మద్ది, మూసాపేట, కందూర్,కొమిరెడ్డి పల్లి,గౌరీదేవిపల్లి, పొన్నకల్,రాచాల, గుడిబండ, వర్నే, ముత్యాలంపల్లి, జంగమాయ పల్లి, సరళా సాగర్ వరకు ఉన్న చెక్ డ్యామ్ లు, సరళా సాగర్ ప్రాజెక్టును నింపి రైతులకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర సాగనుంది.
ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఈ పాదయాత్ర ద్వారా రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యలను తెలుసుకోనున్నారు. పెద్దవాగుకు వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేయనున్నారు. రైతుల సాగునీటి అవసరాలను పరిష్కరించి, పంటలకు నీరందేలా చర్యలు తీసుకోవాలనే లక్ష్యంతో ఈ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. పెద్దవాగుకు సాగునీరు విడుదలయ్యే వరకు రైతుల గొంతుకగా నిలిచి, వారి హక్కుల సాధన కోసం పోరాడటమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగుతోంది.
ఈ కార్యక్రమానికి సంబంధించి అన్నాసాగర్ గ్రామంలో మూసాపేట, అడ్డాకల్ మండలాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సమావేశమై పాదయాత్ర కార్యాచరణ రూపొందించారు.
Read Also :
Ranabaali | ‘జైలర్ 2’ను దాటేసిన ‘రణబాలి’.. నైజాంలో విజయ్ దేవరకొండ సినిమా జోరు!
Mouli | న్యూస్ ఛానెల్ వాళ్లు బ్లాక్మెయిల్ చేశారు.. అనారోగ్యంతో ఉన్నా వెళ్లక తప్పలేదు: మౌళి
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ala venkateshwar reddy | పెద్దవాగు వెంట రైతులతో ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాదయాత్ర.. వివరాలివే
minister bhoomipuja for traffic signal | ట్రాఫిక్ సిగ్నల్ కోసం భూమిపూజ చేసిన బీజేపీ మంత్రి.. సోషల్ మీడియాలో గొప్పగా ప్రచారం
Human Egg | మానవ అండాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు.. ఈడీ దాడుల్లో భారీగా నగదు, ఆస్తులు సీజ్
BRS Party | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ ఇన్ఛార్జీల నియామకం
GST reforms | జీఎస్టీలో సంస్కరణలు.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలు.. వీరికి లబ్ధి
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

