బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలి
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్పై బీఆర్ఎస్ శ్రేణులు, బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని, వలస వెళ్లిన ఓటర్లపై ప్రత్యేక దృష్టి సారించి ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా జాగ్రత్త పడాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కార్యకర్తలకు సూచించారు.
- వలస వెళ్లిన ఓటర్లపై ప్రత్యేక దృష్టి సారించాలి
- ఓట్లు తొలగించే కుట్ర జరిగే అవకాశం ఉంది
- దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
కౌకుంట్ల(దేవరకద్ర), జూలై 7: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్పై బీఆర్ఎస్ శ్రేణులు, బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని, వలస వెళ్లిన ఓటర్లపై ప్రత్యేక దృష్టి సారించి ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా జాగ్రత్త పడాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కార్యకర్తలకు సూచించారు. మంగళవారం డోకూరులో ఎస్ఐఆర్ జరుగుతున్న తీరుపై డోకూరు, జీన్గరాల, గోపన్‌పల్లి, గుడిబండ గ్రామాల బూతుల వారీగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బూత్ ఇన్చార్జీలు, కార్యకర్తలతో జరిగిన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అ ర్హులైన ఓటరు ఓటు హక్కు కోల్పోకుండా బీఎల్ఏలు దగ్గరుండి నమోదు చేయించాలని అన్నారు.
ఓట్లు తొలగించే కుట్ర జరిగే అవకాశం ఉందని, ఎన్యూమరేషన్ పత్రా ల పంపిణీ, ఆన్లైన్ నమోదు చేయించే వరకు పార్టీ బీఎల్ఏలు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. ఎస్ఐఆర్తో బీఎల్ఏలకు బూత్ మీద స్పష్టమైన అవగాహన వస్తుందన్నారు. అనంతరం పార్టీ సంస్థాగత నిర్మాణం, ఎస్ఐఆర్పై, సభ్యత్వ న మోదు కార్యక్రమంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఆల ప్రీతి, మండల బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్, కర్ణం రాజు, నరేందర్‌రెడ్డితోపాటు ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు, బీఎల్ఏలు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

