మద్దూర్(కొత్తపల్లి)మార్చి17 : తల్లిదండ్రులు జీవితానికి ప్రథమ గురువులని నారాయణపేట అదనపు కలెక్టర్ బెన్షాలం అన్నారు. సోమవారం మండలంలోని పెదిరిపాడు జెడ్పీహెచ్ఎస్లో వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులతో తల్లిదండ్రులకు పా దపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో ముందుకు సాగాలన్నారు.
కష్టపడి కాకుండా ఇష్టంతో చదవాలని, అదేవిధంగా పరీక్షలంటే భయాన్ని వీడాలని సూ చించారు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులకు కొ న్ని రోజులపాటు సెల్ఫోన్లు, టీవీలకు దూరంగా ఉం డి పరీక్షలకు సన్నద్ధం కావాలని, పదిలో 10 జీపీఏ సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకువాలని వివరించారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ గరిమనరుల, డీఈవో గోవిందరాజులు, హెచ్ఎం బాలకిష్టప్ప, ఉ పాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు.