బల్మూరు, జూన్ 9 : మైనింగ్ పనులను చేసేందుకు ప్రజలను నుంచి వచ్చిన అభిప్రాయలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని అదనపు కలెక్టర్ అమరేందర్ అన్నారు. మంగళవారం మండలకేంద్రమైన బల్మూరు శివారులోని క్వారీలో పర్యావరణ కాలుష్యం పై ప్రజలు, రైతుల అభిప్రాయ సేకరణ కోసం సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో మైలా రం, బల్మూరు గ్రామాలకు చెందిన ప్రజలు, రైతులు పాల్గొని 25 మంది తమ అభిప్రాయాలను తెలిపారు. మైనింగ్ పనులు చేస్తే తమ ప్రాణాలను వదులుకుంటామని అధికారులకు హెచ్చరించారు. మైలారం శివారులో శివాలయం గుట్ట దగ్గర చేసిన మైనింగ్ పనులను ప్రభుత్వం ఆపే విధంగా పోరాటం చేయడం చేశామన్నారు.
గత కొన్ని నెలలుగా మైనింగ్ పనులను ప్రారంభించడంతో అడవిలో ఉండాల్సిన కోతులు, ఎలుగుబంట్లు, వివిధ రకాల మూగజీవాలు గ్రామాల్లో వచ్చి ప్రజలపై, ముఖ్యంగా చిన్న పిల్లలపై దాడు లు చేస్తున్నాయని వాపోయారు. మళ్లీ మైనింగ్ పేరుతో బల్మూరు శివారులో చేస్తామని రావడం ఏమిటీ అన్ని అధికారులను ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వ హ యాంలో మైలారం, బల్మూరు గ్రామాలు పక్క రాష్ర్టాలకు చెందిన్నవా? లేక వేరే దేశాల్లో ఈ గ్రామాలు ఉన్నాయవా? ఎందుకు మాపై ఇంత కోపం ప్రజలు ప్రశ్నించారు.
మైలారం గుట్టపై చాలాప్రసిద్ది చెందిన ఆలయాలు ఉండడం, అటవీ జంతువులు, చాలా ఉన్నాయన్నారు. మైనింగ్ పనులను చేయడం వలన ప్రజలకు, మూగజీవాలకు అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉందన్నారు. మైనింగ్, రిజర్వాయర్ గుత్తేదారులతో అధికారులు, నాయకులు కుమ్మకై ప్రజలను ప్రశాంత వాతావారణంలో లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సభలో మీరు తెలిపిన అభిప్రాయాలను వీడియో రూపంలోనే కాకుండా నివేదిక రూపంలోనూ ప్రభు త్వం దృష్టికి తీసుపోతామని వివరించారు. సమావేశంలో పొల్యూషన్ రీజనల్ అధికారి సురేశ్‌బాబు. తాసీల్దార్ శ్రీకాంత్, సర్పంచులు శిరీష, సరితతోపాటు పోలీసు అధికారులు పాల్గొన్నారు.