
కోస్గి, డిసెంబర్ 7 : మున్సిపల్ పరిధిలో అక్రమ లే అవు ట్లు ఎవరైనా ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకోవాలని, ప్రస్తు తం ఉన్న వెంచర్లలో 10శాతం మున్సిపాలిటీకి కేటాయించిన భూమిని అప్పగించాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని ఏబీకే ఫంక్షన్ హాల్లో అధికారులతో సమీక్షాసమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానాకి ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగించాలని, అందుకు అనుగుణంగా అధికారులు పని చేయాలని పేర్కొన్నారు. రోడ్లకు ఇరువైపులా ఉ న్న అక్రమ డబ్బాలను వెంటనే తొలగించాలన్నారు. మున్సిపల్ తీర్మానం చేసినా కమిషనర్ ఎందుకు తొలగించడం లేదని కౌన్సిలర్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అం దుకు స్పందిన అదనపు కలెక్టర్ డబ్బాలను తొలగిస్తామని, ఎవరైనా రాజకీయం చేస్తే క్రి మినల్ కేసులు నమోదు చేయాలని, రెండు రోజూల్లో తీసివేస్తామన్నారు. పట్టణంలోని బృందావన్ కాలనీలో వెంచర్లో 10శాతం భూమిని పంచనామా చేసి కలెక్టర్‌కు నివేదిక పంపాలని, రేపటి లోగా తమ కార్యాలయానికి నివేదిక రావాలని అదనపు కలెక్టర్ కమిషనర్ మల్లికార్జునస్వామికి సూచించారు.
మిషన్ భగీరథ పనులు వేగంగా సాగుతున్నాయని, ప నుల్లో మరింత వేగం పెంచాలన్నారు. ఈనెలాఖరు కల్లా ప నులు పూర్తి చేయాలన్నారు. అభివృద్ధి పనులకు ఇసుక కొర త ఉందని కౌన్సిలర్లు చెప్పడంతో త్వరలో ఆన్లైన్ ఇసుక ప్రారంభించేలా అధికారులతో మాట్లాడుతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గ్రామ కంటంలోని పురాతన నివాసాలు ఆన్లైన్లో లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పడంతో వాటి వివరాలు రేపటి లోగా తమకు అందించాలని సీడీఎంఏ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని అదనపు కలెక్టర్ హామీ ఇచ్చారు. పట్టణం లో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని వాటిపై చర్య లు తీసుకోవాలని కౌన్సిలర్లు చెప్పడంతో చర్యలు తీసుకోకుంటే ఊరుకునేది లేదని కమిషనర్‌పై అదనపు కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో పార్కు, డంపింగ్ యార్డు పనులు పూర్తి చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న మున్సిప ల్ సిబ్బంది వేతనాలు వెంటనే చెల్లించాలని కమిషనర్‌కు సూచించారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ ఏడీ పుల్ల య్య, ఏఈ కార్తీక్, మున్సిల్ ఏఈ విలోక్, జిల్లా గ్రంథాల య సంస్థ చైర్మన్ రామకృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ శిరీష, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.