ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి
ముడుమాల్ దొడ్డి గ్రామంలోని సర్వే నంబర్ 68లో 36 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ భూమి ఆక్రమణకు గురైందని జ్యోతిరావు పూలే బీసీ సంఘం వ్యవస్థాపకులు వాకిటి అంజనేయులు ముదిరాజ్ ఆరోపించారు.
మాగనూరు : నారాయణపేట జిల్లా కృష్ణ మండలం ముడుమాల్ దొడ్డి గ్రామంలోని సర్వే నంబర్ 68 లో 36 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ ( Government Land ) భూమి ఆక్రమణకు గురైందని జ్యోతిరావు పూలే బీసీ సంఘం వ్యవస్థాపకులు వాకిటి అంజనేయులు ముదిరాజ్ ( Anjaneyulu Mudiraj ) ఆరోపించారు. కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తహసీల్దార్‌కు గురువారం వినతి పత్రం అందజేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ భూమి ఆక్రమణపై ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రికార్డుల ప్రకారం సదరు భూమి ఆన్లైన్లో ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఎలాంటి వ్యవసాయ సాగు జరగడం లేదని తెలిపారు. అధికారిక పంచనామా నిర్వహిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని పేర్కొన్నారు.
భూమి సాగులో లేనప్పటికీ, కొందరు వ్యక్తులు అక్రమంగా రైతు భరోసా, పీఎం కిసాన్ , రైతు బీమా వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందుతూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారని విమర్శించారు. నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా పొందిన వ్యక్తుల పట్టాలను తక్షణమే రద్దు చేసి, ఆ భూమిని ప్రభుత్వ పరంగా స్వాధీనం చేసుకోవాలని కోరారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రాక్టర్ టైరు కిందపడి వ్యక్తి దుర్మరణం.. మెదక్ జిల్లాలో విషాదం
Ranji Trophy: త్రిపురపై ఇన్నింగ్స్ 40 రన్స్ తేడాతో హైదరాబాద్ విన్
Jailer 2 | ‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు.. బుక్‌మైషోలో 6 లక్షలు దాటిన టికెట్ల అమ్మకాలు!
Farmers | చెరుకు రైతుకు గిట్టుబాటు ధర ఏదీ?తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో అన్నదాతల ఆవేదన
Jos Buttler: జోస్ బట్లర్‌కు సర్జరీ.. కోలుకుంటున్నట్లు ఇన్‌స్టాలో పోస్టు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

