నారాయణపేట, ఫిబ్రవరి 4 : నారాయణపేటలో జరిగిన ఓ హత్య కేసును స్థానిక పోలీసులు 24 గంటల్లో ఛేదించి నిందితులను అరెస్టు చేశారు. పట్టణంలోని పోలీ స్ స్టేషన్లో డీఎస్పీ లింగయ్య విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. రాజస్థాన్ రాష్ట్రం భరత్పూర్ జిల్లా శీతల్పూర్ గ్రామానికి చెందిన శివరాజ్ ఆయన బామ్మర్ది విక్రమ్‌సింగ్, తోడల్లుడు కారు అనే ముగ్గురు వ్యక్తులు గత నాలుగేండ్ల కిందట బతుకుదెరువు కోసం తెలంగాణకు వచ్చి మహబూబ్‌నగర్‌లో టైల్స్పని చేస్తూ జీవనం సా గించేవారు. అయితే విక్రమ్‌సింగ్, కారు ఇద్దరు నారాయణపేటలో ఉంటున్నా రు. ఈ క్రమంలో సోమవారం విక్రమ్ సింగ్ హత్య అయినట్లు కారు అనే వ్యక్తి శివరాజ్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. కొంత మంది పండ్ల వ్యాపారం చేసే వ్యక్తులు మినీ స్టేడియంలో విక్రమ్‌సింగ్‌ను కొట్టి హత్య చేసినట్లు శివరాజ్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
ఈ కేసును ద ర్యాప్తు చేపట్టిన పోలీసులు మంగళవా రం పట్టణంలోని సత్యనారాయణ చౌ రస్తా వద్ద గోపి, బాలరాజ్, రాజు, నరేశ్‌కుమార్, మ హ్మద్ రఫీక్‌ను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ చెప్పా రు. గోపి పండ్ల వ్యాపారం చేసేవాడని, తన వ్యాపారం అయిపోయాక రాత్రి సమయంలో పండ్లను మున్సిపల్ కాంప్లెక్స్ గేటు సందులో భద్రపరిచేవాడని డీఎస్పీ తెలిపారు. అయితే కొన్నిసార్లు తన పండ్లను ఎవరో దొంగిలిస్తున్నారని అనుమానించి తన స్నేహితుడు బాలరాజు, తన వద్ద పనిచేసే రాజు, నరేశ్, రఫీక్‌కు తెలియజేసి ద్రు వీకరించుకున్నాడు. మళ్లీ దొంగతనానికి వస్తే కొట్టి చంపి ఎక్కడైనా పారవేయాలని నిర్ణయించుకున్నారు. కొట్టడానికి అనుకూలంగా ఐరన్ రాడ్డు, ప్లాస్టిక్ పైపులు పండ్లు భద్రపరిచే స్థలంలో ఉంచారు. ఈ క్రమంలో మృతుడు విక్రమ్‌సింగ్ సోమవారం(3వ తేదీ)తెల్లవారు జామున పండ్లు దాచిన ప్రదేశంలో ఉండడం చూసిన బాలరాజు, పండ్ల వ్యాపారి గోపి, రాజుకు సమాచారం ఇవ్వగా వారు నరేశ్, రఫీలకు సమాచారం ఇచ్చి అక్కడికి పిలిపించుకున్నారు.
అందరూ కలిసి విక్రమ్‌సింగ్‌ను బాగా కొట్టగా ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. మళ్లీ లేస్తాడేమో అని అనుమానించి ఓ షాపు ముందు పడుకోబెట్టారు. లేవకపోయే సరికి ముందు అనుకున్న పథకం ప్రకారం వ్యాపారి గోపి ఓ ఆటోలో విక్రమ్‌సింగ్‌ను గుర్తు తెలియని వ్యక్తి తాగి పడి ఉన్నాడని దవాఖానలో చేర్పించారు. అప్పటికే విక్రమ్‌సింగ్ మృతి చెందాడని వైద్యులు నిర్ధారించడంతో భయపడిన గోపితోపాటు మిగిలిన నలుగురు పారిపోయారు. కేసు నమోదైన విషయం తె లుసుకున్న నిందితులు మంగళవారం సత్యనారాయణ చౌరస్తా వద్ద ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. మృతుడిని చంపడానికి వినియోగించిన వస్తువులు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఒక రోజులోనే కేసును ఛేదించిన సీఐ శివశంకర్, ఎస్సై వెంకటేశ్వర్లు, పీసీలు రాములు, లింగమూర్తి, ఆంజనేయులును డీఎస్పీ అభినందించారు.