నాగర్‌కర్నూల్ : నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ అవినీతి అధికారి ఏసీబీ (ACB ) అధికారులకు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడ్డాడు. జిల్లాలోని వంగూర్ మండలం మాచినోనిపల్లి గ్రామం టీజీఎస్పీడీసీఎల్కు చెందిన లైన్మెన్ తోట నాగేంద్ర( Thota Nagendra) మంగళవారం రూ.15 వేలు లంచం తీసుకుంటూ చిక్కాడు.
వ్యవసాయానికి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ ( Transformer) ఏర్పాటు కోసం రైతులు లైన్మెన్ను సంప్రదించగా లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధిత రైతు మహబూబ్‌నగర్ పరిదిలోని ఏసీబీని ఆశ్రయించగా మంగళవారం అధికారులు పట్టుకున్నారు. అవినీతికి పాల్పడ్డ లైన్మెన్పై కేసు నమోదు చేసి నాంపల్లి ఏసీబీ కోరఉ్టలో ప్రవేశపెట్టామని అధికారులు వివరించారు.
ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు ఎవరైనా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అవినీతికి పాల్పడే వారి సమాచారాన్ని ఏసీబీ టోల్ ఫ్రీ 1064 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు. వాట్సప్ నంబర్ 9440446106కు తెలంగాణ ఏసీబీ ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా గాని ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించారు.