మరికల్ : రోడ్డు ప్రమాదంలో ( Road Accident ) యువకుడు మృతి చెందిన ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. సంబంధించి పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మరికల్ మండల కేంద్రంలో ( Marikal Mandal ) గురువారం రాత్రి కారు, రెండు బైకులను ఢీకొట్టడంతో రెండు బైకులపై ఉన్న మరికల్ పట్టణానికి చెందిన రంగళి శ్రీనివాస్ ( శ్రీకాంత్), మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం, నంద్యాల గ్రామానికి చెందిన శివారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు.
వీరిని చికిత్స నిమిత్తం 108లో మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి రంగళి శ్రీనివాస్ (25) మృతి చెందినట్లు ఎస్సై రాము తెలిపారు. కారు డ్రైవర్ పరారీలో ఉన్నాడని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు. బీజేపీలో చురుకుగా పాల్గొనే రంగళి శ్రీనివాస్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.