Road Accident | మూసాపేట (అడ్డాకుల), ఆగస్టు 08 : అడ్డాకుల జాతీయ రహదారి స్నేహ చికెన్ పరిశ్రమ ఎదురుగా గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి 10 గంటల సమయంలో వనపర్తి నుంచి అడ్డాకుల వైపు ఓ గుర్తు తెలియని వ్యక్తి నడుచుకుంటూ వెళ్తునట్లు చెప్పారు . కర్నూల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే గుర్తు తెలియని వాహనం అతన్ని ఢీ కొట్టింది. గాయపడిన వ్యక్తిని అంబులెన్స్ లో తీసుకెళ్తుండగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. అతని వయస్సు సుమారు 45 సంవత్సరాలు ఉండవచ్చు.. అతను తెల్ల చెక్స్ అంగీ, బ్లూ జీన్స్ పాయింట్ ధరించాడు. అతని మృతదేహాన్ని మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చురీలో భద్రపరిచినట్లు తెలిపారు. ఎవరైనా ఆచూకీ తెలిసిన వారు.. అడ్డాకుల పోలీస్ స్టేషన్లో లేదా 8712659353 సెల్ నెంబర్కు సంప్రదించాలని ఎస్సై శ్రీనివాసులు తెలిపారు.