దోమల పెంట: దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న నలుగురు కార్మికుల బంధువులను జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంటకు పంపింది. జార్ఖండ్ రాష్ట్ర మైనింగ్ ఆఫీసర్ అవినాష్ ఆధ్వర్యంలో వీరు దోమలపెట్టకు చేరుకున్నారు. ఈ బృందం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్‌ను కలిసింది. ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లపై ఈ బృందం కార్మికుల బంధువులకు అధికారులు చెప్పారు. గత నాలుగు రోజులుగా ఇక్కడ జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ తీరు తెన్నులను బంధువులకు వివరించారు. ప్రమాదానికి ఒకరోజు ముందే కుటుంబ సభ్యులతో మాట్లాడినట్టు జార్ఖండ్ మైనింగ్ ఆఫీసర్ అవినాష్ తెలిపారు.
ఈ నెల 27వ తేదీన ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు మాజీ మంత్రి హరీష్ రావు రానున్నారు. టన్నెల్లో చిక్కుకున్న కార్మిక కుటుంబాలను మాజీ మంత్రి హరీశ్ రావు పరామర్శిస్తారు. అలాగే టన్నెల్లో రెస్క్యూ టీం నిర్వహిస్తున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ పరిశీలిస్తారని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు.