దేవరకద్ర, జనవరి 4 : గ్రామీణ రైతులకు వ్యవసా య రంగంలో చేయూతనిచ్చేందుకుగానూ ఏర్పాటు చేసిన సహకార సంఘాల చైర్మన్లకు ప్రభుత్వం తీపికబురు అందించింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో నిర్వహిస్తున్న ఆర్థిక లావాదేవీలను బట్టి వా రికి గౌరవ వేతనం అమలుచేస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా లో మొత్తం 79 సహకార సంఘాలు ఉన్నాయి. అం దులో మహబూబ్నగర్ జిల్లాలో 17, నాగర్కర్నూల్ లో 17, వనపర్తిలో 15, జోగుళాంబ గద్వాలలో 15, నారాయణపేటలో 15 సంఘాలు ఉన్నాయి. ప్రాథమి క వ్యవసాయ సంఘాలకు చైర్మన్లతోపాటు 13 మంది డైరెక్టర్లు ఉంటారు. కాగా, చైర్మన్లకు సహకార సంఘం వార్షిక, ఆర్థిక లావాదేవీలను బట్టి వేతనాలు పెంచు తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉమ్మ డి జిల్లాలోని చైర్మన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇ ప్పటికే సహకార సంఘాల ద్వారా రైతులకు తక్కువ వడ్డీతో చిరు వ్యాపారులకు రుణాలు, దీర్ఘకాలిక రుణా లు, ధాన్యం కొనుగోళ్లు వంటి సేవలతో సహకార సం ఘాలకు గుర్తింపు వచ్చింది.
వేతనం మంజూరు ఇలా..
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని సహకా ర సంఘాల చైర్మన్లకు గౌరవప్రదమైన వేతనం అందించనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. గతంలో రూ.2 కోట్ల టర్నోవర్ ఉన్న సంఘం చైర్మన్లకు రూ.1,250, రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు రూ.600, రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షలున్న వా రికి రూ.500, రూ.20 లక్షల కంటే తక్కువగా టర్నోవర్ ఉంటే రూ.300 గౌరవ వేతనం అందేది. అయితే, ఈ వేతనం సరిపోవడం లేదని చైర్మన్లు ప్రభుత్వానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు 2023 జనవరి 1 నుంచి కొత్త వేతనం అమలుచేస్తూ జీవో విడుదల చేసింది. రూ.25 కోట్లకు పైగా వ్యాపారం చేస్తే రూ.15 వేలు, రూ.15 కోట్ల నుంచి రూ.25 కోట్ల వ్యాపారం చేస్తే రూ.12.500, రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వ్యాపారం చేస్తే రూ.10 వేలు, రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు వ్యాపారం చేస్తే రూ 7,500, అం తకంటే తక్కువగా వ్యాపారం చేస్తే రూ.5 వేల గౌరవ వేతనం అందించాలని ఉత్తర్వులు విడుదల చేసింది.