నారాయణపేట రూరల్, డిసెంబర్ 5 : జిల్లాకేంద్రంలో ని సీఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో సోమవారం జిల్లాస్థాయి వై జ్ఞానిక, గణిత, పర్యావరణ ప్రదర్శన ప్రారంభమైంది. ఇన్చార్జి డీఈవో గోవిందరాజులు అధ్యక్షతన నిర్వహించిన వై జ్ఞానిక ప్రదర్శన ప్రారంభోత్సవానికి జెడ్పీచైర్‌పర్సన్ వనజాగౌడ్, కలెక్టర్ కోయ శ్రీహర్ష ముఖ్యఅతిథులుగా హాజరై సరస్వతీమాత చిత్రపటానికి పూజలు చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీచైర్‌పర్సన్ మాట్లాడుతూ దేశం శాస్త్ర సాంకేతిక రంగా ల్లో ముందుకు దూసుకుపోతున్నదని, వి ద్యార్థులు మూఢనమ్మకాలను వీడాలని పే ర్కొన్నారు. ప్రతి విద్యార్థిలో ప్రతిభ ఉం టుందని, ప్రతిభను వెలికి తీసేందుకు ఇ లాంటి ప్రదర్శనలు నిర్వహించడం చాలా అవసరమన్నారు. ప్రతి ఇంట్లో ఒక శాస్త్రవేత్త తయారు కావాలన్నారు.
అనంతరం కలెక్టర్ కోయ శ్రీహర్ష మా ట్లాడుతూ విద్యార్థులు ప్రజల దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలను సాంకేతిక పరిజ్ఞానంతో సులువుగా ఆవిష్కరించే విధంగా నూతన ఆవిష్కరణలు ఆవిష్కరిస్తే తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. విద్యార్థు లు చదువులో రాణిస్తూ వైజ్ఞానిక ప్రదర్శన ల్లో కూడా ఉత్సాహంగా పాల్గొనాలన్నారు. ప్రదర్శనల్లో పాల్గొన్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇన్చార్జి డీఈవో గోవిందరాజులు మాట్లాడుతూ విద్యార్థుల అంతర్గత ప్రతిభను వెలికి తీసేందుకు ప్రతి ఏటా ఇలాంటి ప్రదర్శనలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సైన్స్ ఉపాధ్యాయులు తరగతిలో తీరి కాకుండా ప్రాక్టికల్స్ చేసి చూయించాలన్నారు. విద్యార్థులు రాబోయే రోజుల్లో జిల్లాకు నోబెల్ బహుమతిని తీసుకురావాలన్నారు.
సైన్స్ అధికారి భానుప్రకాశ్ మాట్లాడుతూ జిల్లా నుంచి భౌతిక, రసాయన, జీవ, గణిత, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలకు సంబంధించి 141 ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్, కలెక్టర్ ప్రదర్శన స్టా ళ్లను తిలకించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో జ్యోతి, జె సీడీవో పద్మనళిని, మున్సిపల్ చైర్పర్సన్ అనసూయ, జెడ్పీటీసీ అంజలి, ప్రిన్సిపల్ రంగారెడ్డి, ట్రాస్మా అధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి, రాజేశ్, కనకప్ప, యాదయ్యశెట్టి, వివిధ మండలాల ఎంఈవోలు, ఉపాధ్యాయ సంఘం నాయకులు, సై న్స్ ఉపాధ్యాయులు, పీఈటీలు పాల్గొన్నారు.