పెబ్బేరు, మే 13 : ధాన్యం కొనుగోళ్లు ఒక ప్రహసనంగా మారాయని, అధికారులు రైతులకు అడుగడుగునా నరకం చూపిస్తున్నారని ఆరోపిస్తూ ధాన్యం కొనుగోలు చేపట్టాలని కోరుతూ మంగళవారం పెబ్బేరులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి మండల బీఆర్ఎస్ నాయకులు కర్రెస్వామి, జగన్నాథం మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల సందర్భంగా రైతుల ఉసురు తీస్తోందని మండిపడ్డారు. ధాన్యాన్ని తెచ్చి రోజులు గడుస్తున్నా సాకులు చూపుతూ రైతుల సహనాన్ని పరీక్షిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
గన్నీ బ్యాగులు లేవని, లారీలు లేవని గోస పెడుతోందని, దినాల తరబడి కొనుగోలు కేంద్రాల్లోనే రైతులను పడిగాపులు కాచేల చేస్తోందని, తీరా తూకం సమయంలో తరుగు పేరిట నాలుగైదు కిలోలు తక్కువగా చూపుతున్నారని ఆరోపించారు. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కరుణశ్రీ, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు దిలీప్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ హ యాంలో రైతులను అక్కున చేర్చుకుంటే, ఇప్పుడు వారిని రోడ్డున పడేస్తున్నారని విమర్శించారు. గ తంలో ఎప్పుడూ రైతులు ఇంతగా అవస్థలు పడి ఉండరని, వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని కొ నుగోళ్లు సాఫీగా సాగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రా ములు, నాయకులు రాజశేఖర్, ఎల్లారెడ్డి, ఎల్లయ్య, పార్వతి, గోవిందు, వీరస్వామి, విశ్వరూపం, మజీ ద్, శాంతయ్య, మన్యం, గోవర్ధన్‌రెడ్డి, శేఖర్‌గౌడ్ త దితరులు పాల్గొన్నారు.