కొత్తకోట, ఫిబ్రవరి15: పచ్చటి మొక్కే మా జననేతకు ఘనమైన కానుక అని ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ రథసారథి, స్వరాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జ న్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా శనివారం కొత్తకోటలో ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈనెల 17న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వే డుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ జన్మదిన కానుకగా వృక్షార్చన, హరితబృహ త్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.
ఆకాంక్షలు నెరవేర్చి, ఆత్మగౌరవ బావుటా ఎగరవేసి, స్వరాష్ర్టాన్ని సాధించి, బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన కేసీఆర్‌కు ఇవే మా పుట్టిన రోజు శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. పసికూనగా ఉన్న తె లంగాణ రాష్ర్టాన్ని ఈరోజు దేశానికి తలమానికంగా నిలిపిన రాజకీయ చాణక్యుడు కేసీఆర్ అని.. ఇలాంటి విజయం సా ధించడం ఏ ముఖ్యమంత్రికి సాధ్యపడదన్నారు. తెలంగాణ మోడల్‌కు యావత్ దేశమంతా సగర్వంగా జేజేలు కొట్టించి, వినువీధుల్లో తెలంగాణ ఆత్మగౌరవ పతాకను సగర్వంగా రెపరెపలాడించిన నాటి, నేటి ఉద్యమ నేతకు వృక్షార్చనతో పాదాభివందనం చేస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపాలని బీఆర్ఎస్ నాయకులు కొత్తకోటలో మొక్కలను నాటారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వామన్‌గౌడ్, విశ్వేశ్వర్, గుం త మౌనిక, మల్లేశ్, చెన్నకేశవరెడ్డి, ప్రశాంత్, రాములు, నె హ్రూ, నాగన్న, రవి, నరేశ్, వినోద్‌సాగర్ పాల్గొన్నారు.
కేసీఆర్ పాలన మళ్లీ రావాలి..
వనపర్తి టౌన్, ఫిబ్రవరి 15: తెలంగాణ జాతిపిత, తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జ న్మదిన వేడుకలను వనపర్తి బీఆర్ఎస్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ ఆ ధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా పార్టీ కార్యాలయ ఆవరణంలో మొక్కలు నాటి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ.. కేసీఆర్ పాలనలో తెలంగాణ పచ్చదనం, పాడిపంటల తో కళకళలాడిందని, అన్నివర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని, మళ్లీ కేసీఆర్ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. భవిష్యత్ తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ ఆ యురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. బీఆర్ఎస్ నాయకులు అశోక్, ప్రజాప్రతినిధులు నాగన్నయాదవ్, కంచె రవి, రహీం, హేమంత్, రాము, జోహెబ్ హుస్సేన్, హరీఫ్, క్రాంతికుమార్, నీలంభాను, రఘు తదితరులు ఉన్నారు.