ఊట్కూర్ : నారాయణపేట ( Narayanapet ) జిల్లా ఊట్కూర్ మండలంలోని చిన్నపొర్ల ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన (2005-2006) ఎస్సెస్సీ పూర్వ విద్యార్థుల ( Alumni ) సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు .
స్థానిక రైతు వేదికలో నిర్వహించిన సమ్మేళనానికి విద్యాబుద్ధులు నేర్పిన గురువులు, రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఎం. భాస్కర్ రెడ్డి, ఉపాధ్యాయులు భాస్కర్ సాయి, మహమ్మద్ ఇస్మాయిల్, అన్నపూర్ణ, శైలజ హాజరయ్యారు. వీరిని పూర్వ విద్యార్థులు శాలువాలతో ఘనంగా సత్కరించి పాదాభివందనం చేసుకున్నారు.
చదువు పూర్తయి, వివిధ రంగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు 20 ఏళ్ల అనంతరం ఒకే చోట కలుసుకుని తరగతి గదుల అనుభూతులను నెమరు వేసుకున్నారు. పాఠశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని పూర్వ విద్యార్థుల సంఘం నాయకులు తెలిపారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఇర్షాద్, నరేష్, ఇమ్రాన్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.